ఉత్తరప్రదేశ్‌లో ఓ తాగుబోతు రైల్వే అధికారులకు షాకిచ్చాడు. మద్యం మత్తులో రైల్వేట్రాక్‌పైనే నిద్రపోయాడు. ఆ సమయంలో ట్రైన్ కూడా వచ్చేసింది. కానీ ఆ వ్యక్తి ఎలాంటి గాయాలు కాకుండానే క్షేమంగా బయటపడ్డాడు.
యూపీలోని ఫిరోజాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యతో దారుణానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో భర్త భార్యను కట్టేసి కొట్టాడు. అంతేకాకుండా.. అన్నకు సాయం చేసేందుకు తమ్ముళ్లు సహకారం అందించారు. తీవ్రంగా ఆ మహిళను కొట్టడంతో చనిపోయింది. మహిళ మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపించగా.. పోస్టుమార్టం నివేదికలో మహిళపై జరిగిన దారుణం బయటపడింది. పోస్టుమార్టంలో మహిళ పేగు దగ్గర ఎనిమిది అంగుళాల పైప్ లభ్యమైంది. రిపోర్టు చూసి డాక్టర్లు కూడా షాక్ అయ్యారు.
UP Teacher: ఉత్తర్ ప్రదేశ్‌లో ఉపాధ్యాయుల కోసం తీసుకువచ్చని డిజిటల్ హాజరు వ్యవస్థను ఆసరాగా చేసుకుని ఓ ఉపాధ్యాయుడు, తన తోటి మహిళా టీచర్ని ‘‘ముద్దు’’ కోరడం వివాదాస్పదమైంది.
Barber: తినే ఆహరంలో, కూల్‌డ్రింక్స్‌లో కొందరు పైశాచిక ఆనందం కోసం ఉమ్మేయడం చూశాం. ఇప్పుడు ఓ బార్బర్ తన కస్టమర్ ముఖానికి మసాజ్ చేస్తున్న సమయంలో ఉమ్మిని ఉపయోగించిన వీడియో వైరల్‌గా మారింది. ఉత్తర్ ప్రదేశ్ కనౌజ్‌కి చెందిన ఓ సెలూన్లో బార్బర్ కస్టమర్ ముఖానికి ఉమ్మిని రాసిన వీడియో వైరల్‌గా మారడంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు.
Viral Video : న్యాయవాదులు, పోలీసులతో కిక్కిరిసిన కోర్టు ఆవరణలో నల్లకోటు ధరించిన ఇద్దరు మహిళలు జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Awadhesh Prasad: ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాలను అయోధ్య బాలిక సామూహిక అత్యాచార ఘటన కుదిపేస్తోంది. బేకరీలో పనిచేసే 12 ఏళ్ల బాలికపై బేకరీ యజమాని మోయిద్ ఖాన్, అతడి ఉద్యోగి రాజు ఖాన్ అత్యాచారానికి పాల్పడ్డారు.
Ayodhya gangrape: ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో 12 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ అంశం సంచలనంగా మారింది. అయోధ్యలో జరిగిన ఈ ఘటనపై ఇప్పటికే యోగి సర్కార్ చర్యలు ప్రారంభించింది. అయోధ్య జిల్లాలోని భదర్సా నగర్లో ఖాన్ బేకరీ యజమాని, స్థానిక సమాజ్‌వాదీ పార్టీ నేత అయిన మోయిద్ ఖాన్, అతడి ఉద్యోగి రాజు ఖాన్ ఇద్దరు అందులో పనిచేస్తున్న 12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
యూపీలోని బదౌన్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో.. డేటాగంజ్-బడాయూన్ రహదారిపై హైటెన్షన్ లైన్ తెగిపడి బైక్‌పై వెళుతున్న దంపతులపై పడింది. దీంతో.. విద్యుత్ ఘాతుకానికి గురై భార్యాభర్తలు అక్కడికక్కడే మరణించారు. బైక్ కూడా పూర్తిగా కాలిపోయింది. ఎలాగోలా ప్రజలు హైటెన్షన్ లైన్‌ను తొలగించారు.
యూపీ రాష్ట్రం ఘాజీపూర్‌లోని వీర్పూర్ గ్రామంలో శుక్రవారం విషాదం చేటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఓ మహిళ పాముకాటుతో మృతి చెందింది. మృతదేహాన్ని చూసిన కొంతసేపటికి భర్త కూడా షాక్‌కు గురై గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కుమారులు, కుమార్తెల రోదనలతో గ్రామస్తుల కంట కన్నీరు మున్నీరైంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని భార్యాభర్తల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.