ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రక్షాబంధన్ వేడుకలు జరుపుకునేందుకు ఇంటికి వెళ్తున్న కూలీల పికప్‌ను బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందగా, పలువురు చిన్నారులు సహా 29 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
READ MORE: Governor Jishnu Dev Varma: “మైల్స్ ఆఫ్ స్మైల్స్” మై లైఫ్ జర్నీ పుస్తకాన్ని ఆవిష్కరించిన గవర్నర్
పోలీసుల కథనం ప్రకారం.. అలీఘర్‌లోని అత్రౌలీ తహసీల్‌లోని అహెరియా నాగ్లా గ్రామానికి చెందిన కార్మికులు ఘజియాబాద్‌లోని ఒక ఫ్యాక్టరీలో పని చేసేవారు. రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని కూలీలంతా ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఘజియాబాద్ నుంచి పికప్‌లో తమ తమ గ్రామాలకు తిరిగి వస్తున్నారు. ఉదయం10.15 ప్రాంతంలో సేలంపూర్ వద్దకు రాగానే వేగంగా వస్తున్న బస్సు పక్క నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదం అనంతరం రోడ్డుపై పడిన క్షతగాత్రులను స్థానికులు ప్రయివేటు వాహనాలు, అంబులెన్స్‌ల సాయంతో ప్రయివేటు ఆసుపత్రితోపాటు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అలాగే బస్సులో చిక్కుకున్న డ్రైవర్‌ను రక్షించే ప్రయత్నం చేశారు. అనంతరం క్రేన్ సాయంతో బస్సులో ఇరుక్కున్న డ్రైవర్‌ను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.
READ MORE:Top Headlines @5PM : టాప్ న్యూస్
చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి చేరుకున్న క్షతగాత్రులలో పది మంది మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. బదౌన్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న దగ్గమార్ బస్సు డ్రైవర్ అతి వేగంతో మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేశాడు. రోడ్డుపై పెద్ద సంఖ్యలో వాహనాలు ఉండటంతో.. డ్రైవర్ ట్రాక్‌పైకి మళ్లించాడు. దీంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం 10.15 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందని, అనంతరం పోలీసులకు సమాచారం అందించగా.. అరగంట ఆలస్యంగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారని స్థానికులు ఆరోపించారు.