Lucknow Horror: లక్నోలో దారుణం చోటు చేసుకుంది. నిర్భయ తరహాలో ఇంజనీరింగ్ విద్యార్థిపై అత్యాచారం చోటు చేసుకుంది. విద్యార్థిని కిడ్నాప్ చేసి, కదులుతున్న కారులో ఆమెపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆగస్టు 10వ తేదీ సాయంత్రం జరిగింది. బాధితురాలు చదువుతున్న కాలేజీకి చెందిన మాజీ విద్యార్థి ఈ ఘటనకు పాల్పడినట్లు తెలస్తోంది. లక్నోలోని సికింద్రా ప్రాంతంలో ఆమెని అపహరించారు. ఆమె కాళ్లు, చేతులు కట్టేసి కారులో లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలిని ఆగ్రా-ఢిల్లీ హైవేలో ఒక కూడలి వద్ద సెమీ న్యూడ్ స్థితిలో వదిలేశారు.
Read Also: New SIM card rules: సెప్టెంబర్ నుంచి కొత్త రూల్స్.. అలా చేశారో మీ సిమ్ కార్డు బ్లాక్..!
ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం అతడిని పట్టుకునేందుకు ఆగ్రా పోలీసులు వేట ప్రారంభించారు. ఒక ఏడాది కిత్రం నిందితుడు ఆగ్రాలోని భీమ్ రావ్ అంబేద్కర్ యూనివర్సిటీని డిగ్రీ పొందాడు. కాలేజీలో ఉన్నప్పటి నుంచి నిందితుడు సదరు బాధితురాలిపై ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిసింది. తనతో రిలేషన్ పెట్టుకోవాలని వేధించాడు. అయితే, బాధిత విద్యార్థి మాత్రం ఇందుకు నిరాకరించింది. దీంతో ప్రతీకారం తీర్చుకునేందుకు ఆమె గురించి హెచ్‌ఓడీకి తప్పుడు సమాచారం ఇచ్చి ప్రతీకారం తీర్చుకున్నాడు. దీంతో ఆమె మార్క్‌షీట్ నిలిపేయబడింది.
ఆగస్టు 10వ తేదీని బాధితురాలు సికింద్రాలోని కార్గిల్ సర్కిల్ వద్ద నిలబడి ఉండగా, నిందితులు ఆమె వద్దకు కారుతో వచ్చి బలవంతంగా ఎక్కించుకెళ్లారు. ఆమె కాళ్లు, చేతులు కట్టేసి కారు కర్టెన్స్ దించి, ఆమె అరుపులు ఎవరికి వినపడకుండా లౌడ్ మ్యూజిక్ ప్లే చేస్తూ, అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాతి రోజు బాధితురాలు సికింద్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పరీక్షల తర్వాత అత్యాచారం జరిగిందని తేలడంతో BNS సెక్షన్లు 376 (రేప్), 342 (తప్పుగా నిర్బంధించడం), మరియు 506 (నేరపూరిత బెదిరింపు) కింద కేసులు నమోదు చేశారు. నిందితుడికి అనేక మంది మహిళలతో రిలేషన్స్ ఉన్నట్లు తెలటుస్తోంది. బాధితురాలు తన ప్రపోజల్ తిరస్కరించిందనే కారణంతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.