Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాకి చెందిన 24 ఏళ్ల యువకుడిని భూ వివాదంలో నలుగురు వ్యక్తులు సజీవంగా పూడ్చిపెట్టిన తర్వాత తనను వీధి కుక్కలు రక్షించాయని చెప్పాడు.
ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షం కారణంగా ఓ ఇంటి పైకప్పు కూలిపోయింది. దీంతో.. ఒకే కుటుంబానికి చెందిన వృద్ధురాలు, ముగ్గురు బాలికలు శిథిలాల కింద పడి చనిపోయారు. మరో ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాలను తొలగిస్తుండగా.. 11 ఏళ్ల బాలిక తన నానమ్మకు అతుక్కుపోయి కనిపించింది. శిథిలాల నుండి బయటకు తీసి వారిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
యూపీలోని సోన్‌భద్రలో ఓ ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. జార్ఖండ్‌లోని తన ఇంటి నుంచి 3 నెలలుగా కనిపించకుండా పోయిన ఒక మహిళ.. యూపీలోని సోన్‌భద్రలోని గుహ లోపల నాగినిలా ప్రత్యక్షమైంది. ఆ మహిళ అచ్చం పాములాగే బుసలు కొడుతూ అసాధారణ స్థితిలో కనిపించింది. ఆ మహిళ నాగిని లాగే భూమిపై పాకుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో పర్యటించారు. సుల్తాన్పూర్ సివిల్ కోర్టు నుండి లక్నోకు వెళుతుండగా.. రాహుల్ గాంధీ కాన్వాయ్ గుప్తర్గంజ్లోని ఎమ్మెల్యే నగర్‌లోని ఓ చెప్పుల కొట్టు వద్ద ఆగారు. రాహుల్ గాంధీ ఆ కొట్టులో కూర్చుని చెప్పులు కుడుతున్న వ్యక్తితో మాట్లాడారు.
Defamation Case: పరువునష్టం కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇవాళ (శుక్రవారం) ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సుల్తాన్ పూర్ లోని ఎంపీ– ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టుకు హాజరు కాబోతున్నారు.
Kanwar Yatra: కన్వార్ యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించేవారు తమ యజమానుల పేర్లను తప్పనిసరిగా దుకాణాలపై ప్రదర్శించాలన్న ఆదేశాలను తాజాగా ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ సమర్థించుకుంది. తీర్థయాత్ర శాంతియుతంగా సాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొనింది.
Kanwar Yatra: ఉత్తర్ ప్రదేశ్‌లో ‘కన్వర్ యాత్ర’ ఆర్డర్ ఇటీవల కాలంలో వివాదాస్పదమయ్యాయి. యాత్రికులు వెళ్లే మార్గాల్లోని తినుబండారాల షాపులు, ఇతర దుకాణదారులు తమ పేర్లు బోర్డులపై ప్రదర్శించాలని ప్రభుత్వం ఆదేశించింది.
నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. చెవుల్లో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని ఇద్దరు యువకులు రైల్వేట్రాక్‌పై కూర్చుని సంగీతం వింటున్నారు. సంగీతంలో లీనమైపోయి.. కనీసం రైలు హారన్ కూడా వినిపించలేదు.
కన్వర్ యాత్ర సందర్భంగా కన్వర్ మార్గంలోని దుకాణాలపై నేమ్ ప్లేట్లను అమర్చాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించడంపై ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు ప్రతిపక్షాలు ఈ ఉత్తర్వుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతుండగా.. మరోవైపు ఈ ఉత్తర్వులపై ఓ స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
Kanwar Yatra: ఉత్తర్ ప్రదేశ్‌లో జరుగుతున్న ‘కన్వర్ యాత్ర’ వివాదాస్పదంగా మారింది. యాత్రికులు వెళ్లే మార్గాల్లోని తినుబండారాలు, ఇతర దుకాణాల యజమానులు తమ పేర్లు కనిపించేలా బోర్డులను ఏర్పాటు చేయాలని ఇటీవల ముజఫర్‌నగర్ జిల్లా పోలీసులు ఆదేశించారు.