Uttar Pradesh: బాలికపై స్కూల్ టీచర్ అత్యాచారం.. చికిత్స పొందుతూ మృతి
- 14 ఏళ్ల బాలికపై ఉపాధ్యాయుడు అత్యాచారం
- ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలిక మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: కోల్‌కతాలో మహిళా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రలో 14 ఏళ్ల బాలిక ఉపాధ్యాయుడిచే అత్యాచారానికి గురై మరణించింది. 14 ఏళ్ల బాధితురాలు, సోన్‌భద్ర జిల్లాలోని దుద్ది గ్రామంలోని నివాసి, వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్శిటీ ఆసుపత్రిలో 20 రోజులుగా చికిత్స పొందుతూ మంగళవారం అర్థరాత్రి మరణించింది. నిందితుడు విశాంబర్ ఇంకా పరారీలో ఉన్నాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు పాఠశాలలో స్పోర్ట్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్నాడని, గతేడాది డిసెంబర్ 30న ఓ స్పోర్ట్స్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఆమెను పిలిచాడని తెలిపారు. అనంతరం ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అవమానానికి భయపడి బాధితురాలు ఏమీ చేయలేదని, ఘటన తర్వాత ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెను బంధువుల వద్దకు వెళ్లేందుకు ఛత్తీస్‌గఢ్‌కు పంపగా, అక్కడ ఆమెకు చికిత్స అందించినప్పటికీ ఆమె ఆరోగ్య పరిస్థితి అలాగే ఉంది. దీంతో బాధితురాలు మౌనం వీడి జరిగిన విషయాన్ని అత్తకు చెప్పగా.. ఆమె ఆస్పత్రిలో చేర్చింది.
Read Also: Kolkata Doctor Case: ‘దేశం ఆత్మపై దాడి’.. సీజేఐ వద్దకు చేరిన కోల్‌కతా మహిళా డాక్టర్ హత్య కేసు
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
పరువు పోతుందని భయపడి ఘటనపై అధికారులకు ఫిర్యాదు చేయలేదని కుటుంబీకులు తెలిపారు. అయితే బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమె తండ్రి జులై 10న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాకు చెందిన విశాంబర్‌పై కేసు నమోదు చేశారు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని సీనియర్ పోలీసు అధికారి మంగళవారం తెలిపారు. కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో పనిచేస్తున్న సమయంలో మహిళా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేయడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!