India vs New Zealand: టీమిండియాకు ఆ హోటల్ అస్సలు కలిసి రావట్లేదట.. ఫైనల్‌కు ముందు సంచలన నిర్ణయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs New Zealand: రేపు తుది సమరానికి భారత్ సిద్ధమైంది. ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఢీ కొట్టేందుకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించుకుంది. అయితే.. టీమిండియా తాజాగా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు హోటల్‌ను మార్చింది. భారత క్రికెట్ జట్టులో నమ్మకాలకు కేర్ ఆఫ్ అడ్రస్. భారత జట్టులో చాలా మంది ఆటగాళ్లు చిన్న చిన్న విశ్వాసాలను సీరియస్‌గా తీసుకుంటారు. తాజాగా ఫైనల్ దగ్గర పడుతున్న సమయంలో అలాంటి సంఘటన ఒకటి చర్చకు వచ్చింది. అహ్మదాబాద్‌లో జరగబోయే తుది పోరుకు ముందు భారత జట్టు తమకు కేటాయించిన హోటల్‌ను మార్చిందని వార్తలు వచ్చాయి. అయితే అహ్మదాబాద్ నగరంలో గతంలో ఎదురైన చేదు అనుభవాలు ఇంకా జట్టు మనసుల్లో ఉన్నాయనే భావన కలుగుతోంది. ఎందుకంటే ఈ మైదానం భారత జట్టుకు గతంలో అంతగా కలిసిరాలేదు. రెండు పెద్ద మ్యాచ్‌లలో ఇక్కడే చేదు ఓటములు ఎదురయ్యాయి.
READ MORE: ‘ధురంధర్ 2’ ట్రైలర్ వచ్చేసింది.. బాక్సాఫీస్ వద్ద మళ్ళీ వసూళ్ల సునామీ గ్యారంటీ!
Also Read
2023లో ప్రపంచ కప్ తుది పోరులో భారత జట్టు భారీ ఆశల మధ్య ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. దేశమంతా విజయాన్ని ఎదురుచూస్తుండగా ఆ మ్యాచ్‌లో జట్టు పూర్తిగా తడబడింది. అదే మైదానంలో ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లోనూ భారత జట్టుకు భారీ పరాజయం ఎదురైంది. 188 పరుగుల సాధించాల్సి ఉండగా.. జట్టు కేవలం 111 పరుగులకే కుప్పకూలింది. అయితే.. ఈ రెండు కీలక మ్యాచుల్లో ప్లేయర్స్ ఓ హోటల్‌లో బస చేశారు. ఆ హోటల్ కలిసి రాలేదట. అందుకే అహ్మదాబాద్‌లోని మరో హోటల్‌కు సిఫ్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ అంశంపై అధికారికంగా ఎవరూ మాట్లాడకపోయినా గతంలో అదే హోటల్‌లో ఉన్నప్పుడు రెండు కీలక మ్యాచ్‌లలో ఓడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే అని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఇదొక్కటే కాదు, ఈ పోటీలో భారత జట్టు మరి కొన్ని విషయాల్లోనూ విశ్వాసాలను పాటించినట్లు తెలుస్తోంది. ముంబైలో జరిగిన సెమీఫైనల్‌కు ముందు రోజు సాధారణంగా జరిగే సాధన కార్యక్రమాన్ని జట్టు నలభై ఐదు నిమిషాలు ఆలస్యం చేసింది. ఆ సమయంలో చంద్ర గ్రహణం ఉండటమే కారణమని చెబుతున్నారు. భారతీయ సంప్రదాయాల్లో గ్రహణ సమయంలో కొత్త పనులు ప్రారంభించకూడదనే నమ్మకం ఉండటంతో ఆ సమయాన్ని దాటిన తర్వాతే సాధన మొదలుపెట్టారు.
READ MORE: Gaddar Film Awards 2025: గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2025.. ఉత్తమ చిత్రం, విజేతల జాబితా ఇదే!
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!