స్కూల్లో పిల్లలు ఒకరికొకరు కొట్టుకోవడం, తిట్టుకోవడం చూస్తూనే ఉంటాం. కానీ.. పిల్లలకు బదులు టీచర్లే పొట్టుపొట్టు కొట్టుకున్నారు. అది కూడా చేతులతో కాదు.. చెప్పులతో. పిల్లలు గొడవపడుతుంటే వద్దని చెప్పాల్సిందిపోయి.. వారే మితిమీరిపోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ చిత్రకూట్ జిల్లాలోని ఓ పాఠశాలలో వెలుగు చూసింది. ఓ ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు టీచర్లు ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఒక మగ టీచర్, ఒక మహిళా టీచర్ ఒకరినొకరు చెప్పుతో కొట్టుకోవడం కనిపించింది. ఈ సమయంలో మగ ఉపాధ్యాయుడు స్వయంగా వీడియో తీస్తున్నాడు. దీనిపై మరింత ఆగ్రహించిన మహిళా ఉపాధ్యాయురాలు అతనిని చెంపదెబ్బ కొట్టింది. నువ్వు వీడియో తీస్తావు అని మహిళా టీచర్ మగ టీచర్ పై రెచ్చిపోయింది.
Read Also: Vinesh Phogat Verdict: వినేశ్ ఫోగట్ రజత పతకంపై డబ్ల్యూఎఫ్ఐ బిగ్ న్యూస్..
మహిళా టీచర్ సప్నా శుక్లా, మగ టీచర్ ఆదేశ్ తివారీ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడం సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఘటన రాజాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమ్హారన్ పూర్వా ఇంగ్లీష్ మీడియం ప్రాథమిక పాఠశాలలో జరిగింది. ఆ ఉపాధ్యాయులు పాఠశాల వాతావరణాన్ని ఘర్షణ వాతావరణంగా నెలకొల్పి ఘర్షణ వాతావరణం సృష్టించారు. ఈ ఘటనపై అధికారులు వెంటనే స్పందించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.
Read Also:Kolkata Doctor Case: కోల్‌కతా వైద్యురాలి హత్యాచార కేసులో సీబీఐ విచారణ మొదలు.. కీలకంగా 6 అంశాలు..
అయితే.. ఈ గొడవకు సంబంధించి కారణాలు తెలియలేదు. అయినప్పటికీ.. సోషల్ మీడియాలో అయితే ఈ వీడియో వైరల్‌గా మారడంతో యూజర్లు తీవ్ర ప్రశ్నలు సంధిస్తున్నారు. చాలామంది నెటిజన్స్ ఈ వీడియో పై విమర్శలు చేస్తున్నారు. చదువు చెప్పాల్సిన వారే ఇలా ఉంటే.. మరి విద్యార్థుల పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.
सरकारी स्कूल के शिक्षक एक दूसरे से भीड़ गये हैं. महिला हावी होती दिख रही है. वीडियो यूपी के चित्रकूट का बताया जा रहा है. pic.twitter.com/ZZcIZkY4ff
— Priya singh (@priyarajputlive) August 13, 2024