MahaKumbh Mela: ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా చివరి దశకు చేరుకుంది. జనవరి 13 నుంచి ప్రారంభమైన ఈ అద్భుత జన సంగమం ఫిబ్రవరి 26 శివరాత్రితో ముగుస్తోంది.
ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో తవ్వకాలలో శివలింగం బయటపడటంతో గ్రామస్థుల్లో ఆనందం వెల్లివిరిసింది. శివలింగ దర్శనం కోసం సమీప ప్రాంతాల నుంచి ప్రజలు రావడం ప్రారంభించారు. శివ లింగ బయటపడ్డ కొద్దిసేపటికే భక్తులు గుమిగూడారు. సమాచారం అందిన వెంటనే పోలీసు బృందం కూడా అక్కడికి చేరుకుంది. మహాశివరాత్రికి ముందు శివలింగం దొరకడం శుభసూచకమని గ్రామస్థులు చెబుతున్నారు.
భార్యాభర్తల మధ్య సంబంధాలు రోజురోజుకు దెబ్బతింటున్నాయి. చిన్న చిన్న కారణాలకే కొట్టుకోవడం.. చంపుకోవడాలు చేస్తు్న్నారు. ఒకరికొకరు కలకాలం తోడుండాల్సిన వాళ్లు.. క్షణికావేశంలో ప్రాణాలు తీసి కటకటాల పాలవుతున్నారు.
ఆస్తి కోసం కొడుకు వృద్ధ దంపతులను దారుణంగా హత్య చేశాడు. సుత్తితో కొట్టి కర్కశకంగా చంపాడు.. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మోహన్‌లాల్‌గంజ్‌లో చోటు చేసుకుంది. హత్య అనంతరం యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. కాగా.. మృతుల చిన్న కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు ప్రారంభించారు.
CM Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కి సంబంధించిన డీఫ్ ఫేక్ వీడియో ఒకటి వైరల్‌గా మారింది. యోగి ముస్లింలు ధరించే టోపీని ధరించినట్లు కొందరు నఖిలీ వీడియోను సృష్టించారు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. దీనిపై హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్లో భారత న్యాయ సంహిత(BNS), IT చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ (85) కన్నుమూశారు. లక్నోలోని ఎస్జీపీజీఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆదివారం మధుమేహం, బీపీతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు.
Maha Kumbh mela: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకి యూపీ సర్కార్ మరింత జాగ్రత్తలు తీసుకుంటోంది. 5వ పవిత్ర స్నానానికి ట్రాఫిక్ జామ్, భద్రతపై అధికారులు దృష్టిసారించారు. గత నెలలో అమృత స్నాన్ సమయంలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది భక్తులు మరణించారు.
క్రూర జంతువులను చూస్తే ఎవరైనా హడలెత్తిపోతారు. అది పులైనా.. సింహామైనా, ఏనుగు అయినా.. ఎలుగుబంటి అయినా భయపడతాం. అలాంటిది ఓ అన్నదాతకు సమీపంలోకి ఒక పెద్ద టైగర్ ఎదురుపడింది.
Bomb Threat: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో గల పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతుంది. ఈ రోజు (ఫిబ్రవరి 5) ఉదయం నాలుగు ప్రైవేట్ స్కూల్స్‌కు ఈ బెదిరింపులు వచ్చాయి.
Byelections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉత్తర ప్రదేశ్, తమిళనాడు రెండు రాష్ట్రాల్లో కూడా ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. యూపీలోని మిల్కిపూర్, తమిళనాడులోని ఈరోడ్ (ఈస్ట్) నియోజకవర్గాల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు.