ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఒక భర్త తన వికలాంగ భార్యకు చెందిన అశ్లీల ఫొటోలు, వీడియోలను అమ్మేశాడు. భార్య నిద్రపోతుండగా.. అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలను రికార్డ్ చేసి పోర్న్ సైట్లలో అమ్మాడని ఆరోపణలు వచ్చాయి. భర్త అదనపు కట్నం కింద రూ.10 లక్షలు డిమాండ్ చేస్తుశాడని.. భార్య డబ్బు ఇవ్వక పోవడంతో ఈ నీచమైన పని చేశాడని భార్య పేర్కొంది.
READ MORE: Mahakumbh Mela 2025: నేటితో ముగియనున్న కుంభమేళా.. పవిత్ర స్నానాల కోసం పోటెత్తిన భక్తులు
పోలీసుల కథనం ప్రకారం.. ఓ వికలాంగ మహిళకు 2023 అక్టోబర్ 24న ఫతేపూర్ సిక్రీకి చెందిన యువకుడితో వివాహం జరిగింది. ఆ అమ్మాయి తండ్రి పెళ్లి సమయంలో రూ.15 లక్షలు ఖర్చు చేశాడు. పెళ్లిలో వరుడికి మోటార్ సైకిల్, నగదు, నగలు ఇచ్చాడు. వివాహం తర్వాత కూడా ఆ యువకుడు అదనపు కట్నంగా రూ.10 లక్షలు, ఇల్లు డిమాండ్ చేయడం ప్రారంభించాడు. వాళ్లు ఇచ్చే స్థితిలో లేకపోవడంతో అతడు భార్యను మానసికంగా, శారీరకంగా వేధించడం ప్రారంభించాడు.
READ MORE: ICC ODI Rankings: ఐసీసీ ర్యాక్సింగ్‌లో టీమిండియా హవా.. టాప్-10లో నలుగురు మనళ్లే
తాను నగ్నంగా ఉన్నప్పుడు వీడియోలు, ఫొటోలను తీసేవాడని భార్య ఆరోపించింది.ఎందుకు తీస్తున్నావని ప్రశ్నించినప్పుడు.. అదనపు కట్నం ఇవ్వకపోతే.. ఈ ఫోటో వీడియోను వైరల్ చేసి డబ్బులు సంపాదిస్తానని హెచ్చిరించాడు. బాధితురాలు తన భర్త గురించి అత్తమామలకు ఫిర్యాదు చేసింది. కానీ వారు కూడా తమ కొడుకుకు మద్దతు ఇచ్చారు. ఒక రోజు ఫొటోలు, వీడియోలను పోర్న్ సైట్లు, స్నేహితులకు పంపానని వాళ్లు తనకు డబ్బు ఇస్తారని భర్త భార్యకు తెలిపాడు. భార్య ఎదిరించడంతో అత్తమామలు ఆమెను కొట్టడం ప్రారంభించారు. ఫిబ్రవరి 16, 2025న, అత్తమామలు కోడలిని కొట్టి, ఇంటి నుండి గెంటేశారు. తన పుట్టింటికి వచ్చిన మహిళ తన కుటుంబ సభ్యులకు తన బాధను వివరించింది. బాధితురాలి తండ్రి ఫిబ్రవరి 24న మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోంది.