Sambhal holi celebration: హోలీ వేడుకల నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ పట్టణం చర్చనీయాంశమైంది. ఇటీవల సంభాల్ పోలీస్ అధికారి చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి. ‘‘హోలీ ఏడాదికి ఒకసారి వస్తుంది. శుక్రవారం నమాజ్ 52 సార్లు చేసుకోవచ్చు. ఎవరికైనా హోలీతో ఇబ్బంది ఉంటే ఇంట్లోనే ఉండాలి’’ అని సంభాల్ పోలీస్ అధికారి అనుజ్ చౌదరి అన్నారు. దీనిపై రాజకీయ విమర్శలు వచ్చాయి. సంభాల్‌లోని వివాదాస్పద జామా మసీదుతో పాటు మరో 10 మసీదులను టార్పలిన్లతో…
UP CM Yogi: ప్రతిపక్ష పార్టీలు, ఆ పార్టీల నేతలు మొఘల్ పాలకుడు ఔరంగజేబును కీర్తించడంపై ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విమర్శలు గుప్పించారు. ఔరంగజేబును ప్రశంసించే వారి మానసిక స్థితి గురించి ప్రశ్నించారు. లక్నోలో జరిగిన మీడియా కార్యక్రమంలో మాట్లాడుతూ.. మానసికంగా సరిగా లేని వ్యక్తి మాత్రమే ఔరంగజేబును ఆదర్శవంతమైన వ్యక్తిగా కొలుస్తారని అన్నారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ వారపత్రిక ఆర్గనైజర్ నిర్వహించిన కార్యక్రమంలో యోగి ఈ కామెంట్స్ చేశారు.
Yogi Adityanath: హిమాలయ దేశం నేపాల్‌లో రాజరిక పాలన కోసం ప్రజలు గళమెత్తుతున్నారు. మాజీ రాజు జ్ఞానేంద్ర కోసం ప్రజలు ర్యాలీలు, నిరసనలు నిర్వహిస్తున్నారు. నేపాల్‌లో ప్రజాస్వామ్యం వద్దని, మళ్లీ రాజరికం కావాలని కోరడం సంచలనంగా మారింది. అయితే, మార్చి 10న రాజు జ్ఞానేంద్రకు అనుకూలంగా త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జ్ఞానేంద్రతో పాటు ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫోటో ఉండటం చర్చనీయాంశంగా మారింది.
హోలీకి ముందు ఉత్తరప్రదేశ్ యోగి ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో కొత్త గోధుమ సేకరణ విధానాన్ని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆమోదించారు. దీంతో పాటు 2025-26 ఆర్థిక సంవత్సరానికి గోధుమ మద్దతు ధరను గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రూ.150 పెంచారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన గోధుమ మద్దతు ధర (MSP)ని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.
Hizbul Mujahideen: రెండు దశాబ్దాలుగా పరారీలో ఉన్న కరడుకట్టిన హిజ్బుల్ ముజాహిదీన్‌తో సంబంధం ఉన్న ఉగ్రవాదిని ఉత్తర్ ప్రదేశ్ ఉగ్రవాది నిరోధక దళం(ఏటీఎస్) అరెస్ట్ చేసింది. ఉల్ఫత్ హుస్సేన్ అలియాస్ మొహమ్మద్ సైఫుల్ ఇస్లాం అలియాస్ అఫ్జల్ హుస్సేన్ మాలిక్‌ని మొరాదాబాద్‌లో అరెస్ట్ చేశారు. యూపీలో పెద్ద ఉగ్రవాద దాడికి కుట్ర పన్నుతున్నట్లు తేలింది.
Shocking News: తన మాట వినడం లేదని 5 ఏళ్ల కూతురిని తండ్రి అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ సీతాపూర్‌లో జరిగింది. పొరుగింటికి పదే పదే వెళ్తుందనే కోపంతో బాలిక గొంతు నులిమి, నాలుగు ముక్కలుగా నరికి హత్య చేశాడు. నిందితుడు మోహిత్ తన పొరుగింటి వారైన రాము కుటుంబంతో గొడవపడుతున్నాడు. తనతో విరోధం ఉన్న పొరుగింటికి తన కుమార్తె వెళ్తుందనే ఒకే ఒక్క కారణంతో హత్యకు పాల్పడ్డాడు.
Yogi Adityanath: ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమాజ్ వాదీ పార్టీపై తీవ్రంగా మండిపడ్డారు. భారతదేశ మతపరమైన భావాలతో "ఆటలు" పడుతోందన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో ఓ పెళ్లి కారు బీభత్సం సృష్టించింది. రాయ్‌బరేలిలోని లక్నో-ప్రయాగ్‌రాజ్ జాతీయ రహదారిపై ఉంచహార్ మార్కెట్ ప్రాంతంలో వేగంగా వచ్చిన ఓ పెళ్లి కారు బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌పై ఉన్న వ్యక్తులు.. ఎగిరి ఆటోపై పడ్డారు. కారు మాత్రం ఆపకుండా వెళ్లిపోయాడు.
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) రాజకీయ పార్టీలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. బీఎస్పీ అధినేత్రి తన మేనల్లుడికి షాక్ ఇచ్చింది. ఆకాశ్ ఆనంద్ ను పార్టీ అన్ని పదవుల నుంచి తొలగించింది. దీంతో పార్టీకి ఇద్దరు కొత్త జాతీయ సమన్వయకర్తలు వచ్చారు. ఆకాష్ ఆనంద్ స్థానంలో ఆయన తండ్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ కుమార్, రాజ్యసభ ఎంపీ రాంజీ గౌతమ్‌లను బీఎస్పీ జాతీయ సమన్వయకర్తలుగా మాయావతి నియమించారు. బీఎస్పీ…
పూర్వకాలం నుంచే పెంపుడు జంతువులను సాదుకోవడం అలవాటైపోయింది. కుక్కలు, పిల్లులు, పక్షులను ఇలా పలు రకాల పెంపుడు జంతువులను ఇళ్లలో పెంచుకుంటారు. ఇంట్లో మనిషి మాదిరిగానే భావిస్తుంటారు. వాటికి ఏ చిన్న ప్రమాదం వచ్చినా తట్టుకోలేరు. ఇదే మాదిరిగా ఓ మహిళ పిల్లిని పెంచుకుంది. దానికి ఆహారాన్ని అందిస్తూ, బాగోగులు చూస్తూ ప్రేమగా చూసుకునేది. అయితే పిల్లికి ఏమైందో ఏమోగాని హఠాత్తుగా చనిపోయింది. దీంతో ఆ మహిళ మానసికంగా కృంగిపోయింది. పిల్లికి అంత్యక్రియలు నిర్వహించకుండా తిరిగి బ్రతికి…