Bomb Threat: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో గల పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతుంది. ఈ రోజు (ఫిబ్రవరి 5) ఉదయం నాలుగు ప్రైవేట్ స్కూల్స్‌కు ఈ బెదిరింపులు వచ్చాయి.
Byelections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉత్తర ప్రదేశ్, తమిళనాడు రెండు రాష్ట్రాల్లో కూడా ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. యూపీలోని మిల్కిపూర్, తమిళనాడులోని ఈరోడ్ (ఈస్ట్) నియోజకవర్గాల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు.
Kumbh stampede: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనలో 30 మంది వరకు భక్తులు మరణించారు. 60 మంది వరకు గాయపడ్డారు. అయితే, ఈ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మెరుగైన నిర్వహణ విధానాలను కోరుతూ పిటిషనర్ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఈ రోజు పిటిషన్‌పై విచారించిన అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఇది దురదృష్టకరమైన సంఘటన, ఆందోళన కలిగించే విషయం, కానీ మీరు దీనిపై హైకోర్టుని ఆశ్రయించండి.…
Rakesh Rathore: ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన కాంగ్రెస్ ఎంపీ రాకేష్ రాథోడ్ అత్యాచార కేసులో ఈ రోజు అరెస్టయ్యారు. సీతాపూర్ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న రాకేష్ రాథోడ్ విలేకరులతో సమావేశం నిర్వహిస్తున్న సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. గత నాలుగు ఏళ్లుగా తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఉత్తర్ ప్రదేశ్ యూనిట్ జనరల్ సెక్రటరీగా ఉన్న రాథోడ్‌పై జనవరి 17న పోలీసులు కేసు నమోదు చేశారు.
Bandi Sanjay: ప్రయాగరాజ్ కుంభమేళాలో తొక్కిసలాట జరగడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోంది అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అన్నారు.
Baghpat Platform Collapse: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. బాగ్‌పత్‌లో జైనులు ఏర్పాటు చేసిన ఆదినాథుడి నిర్వాణ లడ్డూ మహోత్సవ్.. ఈ కార్యక్రమంలో చెక్కతో ఏర్పాటు చేసిన వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. జైన శిష్యులు, పోలీసు సిబ్బందితో పాటు 60 మందికి పైగా గాయపడ్డారు.
Maha Kumbh Mela from space: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్ హిందువుల ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. దేశ విదేశాల నుంచి ప్రయాగ్‌రాజ్ వద్ద జరుగుతున్న ‘‘మహా కుంభ మేళా’’కి కోట్ల సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. గంగా, యమునా, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు.
UP News: పంటకు పురుగులమందు చల్లిన తర్వాత చేతులు కడుక్కోవడానికి నిరాకరించిన రైతు మరణించిన సంఘటన ఉత్తర్ ప్రదేశ్ మథురలో జరిగింది. 27 ఏళ్ల యువ రైతు తన పొలంలో పంటకు పురుగుల మందు చల్లిన తర్వాత, చేతులు కడుక్కోకుండా రాత్రి భోజనం చేశాడు. ఆ తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురై మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. శనివారం రాత్రి ఆలస్యంగా ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
యూపీలోని గంగా పరీవాహక ప్రాంతంలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలను కనుగొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ) డ్రిల్లింగ్ ప్రారంభించింది. శాటిలైట్, జియోలాజికల్ సర్వే తర్వాత జియాలజిస్టులు డ్రిల్లింగ్ పనిని ప్రారంభించారు. సుమారు కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. బల్లియాలోని సాగర్‌పాలి గ్రామ సమీపంలోని గ్రామసభ వైన (రట్టుచక్)లో హైవే వైపున డ్రిల్లింగ్‌ను బృందం ప్రారంభించింది. అస్సాం నుంచి క్రేన్లు, పరికరాలు కొనుగోలు చేశారు.
Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఓ నిత్య పెళ్లికొడుకు చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. తాను పోలీసు అధికారినని చెప్పుకుంటూ ఐదుసార్లు వివాహం చేసుకున్నాడు.