Sambhal Mosque: గతేడాది నవంబర్‌లో ఘర్షణకు కేరాఫ్‌గా మారిన ఉత్తర్ ప్రదేశ్‌లో సంభాష్ ‘‘షాహీ జామా మసీదు’’ మరోసారి వార్తల్లో నిలిచింది. రంజాన్‌కి ముందు మసీదుని పునరుద్ధరించడానికి జామా మసీదు యాజమాన్యం ఏఎస్ఐ అనుమతిని కోరింది. ఇది జరిగిన ఒక రోజు తర్వాత, సంభాల్ జిల్లా యంత్రాంగం ఏఎస్ఐ అనుమతి లేకుండా మసీదులో ఎలాంటి పనులు చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్.. తన కుటుంబ సభ్యులతో కలిసి పవిత్ర స్నానం చేశారు. అనంతరం జ్ఞానేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి గంగా మాత ఆశీస్సులు పొందడానికి వచ్చినట్లు తెలిపారు.
Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకి ఇప్పటి వరకు 62 కోట్ల మంది భక్తులు వచ్చినట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదివారం చెప్పారు. నిర్దిష్ట కాలంలో ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు రావడం ‘‘శతాబ్ధంలోనే అరుదైన సంఘటన’ ’గా అభివర్ణించారు. ఆగ్రాలో జరిగిన యూనికార్న్ కంపెనీ సమావేశంలో యోగి పాల్గొన్నారు.
MahaKumbh Mela: ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా చివరి దశకు చేరుకుంది. జనవరి 13 నుంచి ప్రారంభమైన ఈ అద్భుత జన సంగమం ఫిబ్రవరి 26 శివరాత్రితో ముగుస్తోంది.
ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో తవ్వకాలలో శివలింగం బయటపడటంతో గ్రామస్థుల్లో ఆనందం వెల్లివిరిసింది. శివలింగ దర్శనం కోసం సమీప ప్రాంతాల నుంచి ప్రజలు రావడం ప్రారంభించారు. శివ లింగ బయటపడ్డ కొద్దిసేపటికే భక్తులు గుమిగూడారు. సమాచారం అందిన వెంటనే పోలీసు బృందం కూడా అక్కడికి చేరుకుంది. మహాశివరాత్రికి ముందు శివలింగం దొరకడం శుభసూచకమని గ్రామస్థులు చెబుతున్నారు.
భార్యాభర్తల మధ్య సంబంధాలు రోజురోజుకు దెబ్బతింటున్నాయి. చిన్న చిన్న కారణాలకే కొట్టుకోవడం.. చంపుకోవడాలు చేస్తు్న్నారు. ఒకరికొకరు కలకాలం తోడుండాల్సిన వాళ్లు.. క్షణికావేశంలో ప్రాణాలు తీసి కటకటాల పాలవుతున్నారు.
ఆస్తి కోసం కొడుకు వృద్ధ దంపతులను దారుణంగా హత్య చేశాడు. సుత్తితో కొట్టి కర్కశకంగా చంపాడు.. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మోహన్‌లాల్‌గంజ్‌లో చోటు చేసుకుంది. హత్య అనంతరం యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. కాగా.. మృతుల చిన్న కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు ప్రారంభించారు.
CM Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కి సంబంధించిన డీఫ్ ఫేక్ వీడియో ఒకటి వైరల్‌గా మారింది. యోగి ముస్లింలు ధరించే టోపీని ధరించినట్లు కొందరు నఖిలీ వీడియోను సృష్టించారు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. దీనిపై హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్లో భారత న్యాయ సంహిత(BNS), IT చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ (85) కన్నుమూశారు. లక్నోలోని ఎస్జీపీజీఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆదివారం మధుమేహం, బీపీతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు.
Maha Kumbh mela: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకి యూపీ సర్కార్ మరింత జాగ్రత్తలు తీసుకుంటోంది. 5వ పవిత్ర స్నానానికి ట్రాఫిక్ జామ్, భద్రతపై అధికారులు దృష్టిసారించారు. గత నెలలో అమృత స్నాన్ సమయంలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది భక్తులు మరణించారు.