ఇటీవలి లోక్‌సభ, అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి నిరాశ మిగిల్చాయి. మోడీ ప్రభుత్వ వ్యతిరేకతకు ఈ ఫలితాలు అద్దంపడుతున్నాయి. పెట్రో ధరలు. రైతు ఆందోళనలు.. నిరుద్యోగం. తగ్గిన మోడీ గ్రాఫ్. ఈ అంశాలన్నీ ప్రభావం చూపాయనటంలో అనుమానం లేదు. మామూలుగా అయితే ఈ ఫలితాలను బీజేపీ పెద్దగా పట్టించుకునేది కాదు. కానీ కొన్ని నెలల వ్యవధిలో పలు రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో ఉత్తరప్రదేశ్ కూడా ఉంది. ఈ వ్యతిరేకత కంటిన్యూ అయితే కష్టాలు…
ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి… మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న ప్రణాళికలతో ముందుకు కదులుతోంది బీజేపీ.. ఇదే సమయంలో.. ఓ వైపు ప్రియాంక నేతృత్వంలో కాంగ్రెస్, మరోవైపు అఖిలేష్ యాదవ్ నాయకత్వంలో ఎస్పీ, మాయావతి నేతృత్వంలో బీఎస్పీ.. ఇలా ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు.. ఇక, సీఎం యోగి ఆదిత్యానాథే మరోసారి సీఎం అవుతారనే ప్రచారం కూడా ఉంది.. అంతేకాదు.. మోడీ తర్వాత అంతటి చరిష్మా ఉన్న యోగీయే నంటూ కొంతకాలం ప్రచారం సాగింది.. కానీ,…
యావత్ ప్రపంచంలోని భారతీయులు దీపావళిని అంగరంగ వైభవంగా జరుపుకుంటుంటారు. కరోనా కారణంగా గతేడాది పెద్దగా ఈ పండుగను నిర్వహించుకోలేకపోయారు. కరోనా నుంచి క్రమంగా బయటపడుతుండటంతో దీపావళి వేడుకను ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించారు. దీపావళి రోజున పెద్ద ఎత్తున టపాసులు కాలుస్తారు. చెడుపై మంచి విజయానికి గుర్తుగా ఈ వేడుకను నిర్వహిస్తారు. అన్ని ప్రాంతాల్లో టపాసులు కాలిస్తే, ఆ ఒక్క ప్రాంతంలో మాత్రం టపాసులకు బదులుగా కర్రలతో కొట్టుకొని రణరంగం సృష్టిస్తారు. దీనికి కారణం లేకపోలేదు.…
దేశాన్ని మరోసారి జికా వైరస్ వణికిస్తోంది. ముఖ్యంగా యూపీలో జికా వైరస్ కారణంగా పలువురు మృత్యువాత పడుతున్నారు. బుధవారం ఒక్కరోజే యూపీలో 25 జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో ఆరుగురు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన వ్యక్తులు, 14 మంది మహిళలు ఉన్నారు. యూపీలో ఎక్కువగా కాన్పూర్ ప్రాంతంలో జికా వైరస్ కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 23న కాన్పూర్‌లో తొలి జికా వైరస్ వెలుగు చూసింది. Read Also: మార్కెట్లోకి బఫర్ స్టాక్.. తగ్గిన ఉల్లి…
ఉత్తరప్రదేశ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు వస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ హామీల వర్షం కురిపిస్తోంది.. తమ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు, స్కూటర్లు, స్మార్ట్ఫోన్లు, బస్సులో ప్రయాణం.. కల్పిస్తామని ప్రకటించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ వాద్రా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.. కాగా, ఇప్పటికే ఎన్నికల్లో మహిళలకు 40 శాతం టిక్కెట్లు కేటాయిస్తామని చెప్పిన ప్రియాంక… తాజాగా ఉచిత హామీలను ప్రకటించారు. అవకాశం దొరికినప్పుడల్లా.. తాము ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి…
లఖింపూర్ ఖేరీ ఘటనలో యూపీ ప్రభుత్వం పై సుప్రీం కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. యూపీ ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది హారీష్ సాల్వే 68 మంది సాక్షుల్లో 30 మంది వాంగ్మూలాలను రికార్డు చేసినట్లు తెలిపారు. దీన్లో 23 మంది తమను తాము ప్రత్యక్ష సాక్షులుగా పేర్కొన్నట్టు తెలిపారు. ఈఘటనలో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్ట్రామన్ కశ్యప్, మరో మృతుడు శ్యామ్…
దేశ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్‌కు ప్రత్యేక స్థానం ఉంది.. పెద్ద రాష్ట్రం కావడం.. ఎక్కువ మంది ఎంపీలు ప్రానిథ్యం వహించే రాష్ట్రం కూడా కావడంతో.. జాతీయ పార్టీలు ఈ రాష్ట్రంపై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతూ వస్తున్నాయి.. ఇక, స్థానిక ఎస్పీ, బీఎస్పీలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి.. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో అధికార పీఠాన్ని దక్కించుకొనేందుకు, బలమైన శక్తిగా ఎదిగేందుకు ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ.. కొత్త వ్యూహాలతో ప్రజల ముందుకు వెళ్తోంది..…
ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యేకు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. ఫేక్ మార్కుల షీట్‌తో కాలేజ్‌లో అడ్మిషన్ తీసుకున్నందుకు ఎమ్మెల్యే ఇంద్ర ప్రతాప్ తివారీకి జైలు శిక్ష వేసింది స్థానిక ప్రజాప్రతినిధుల కోర్టు. అంతే కాదు రూ. 8 వేల జరిమానా కూడా విధించింది. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పూజా సింగ్ ఆదేశాలతో పోలీసులు ఎమ్మెల్యేను కస్టడీలోకి తీసుకుని జైలుకు తరలించారు. కాగా, ఇంద్ర ప్రతాప్ తివారీ.. డిగ్రీ చదువుతున్న రోజుల్లో.. రెండో ఏడాది ఫెయిల్ అయినప్పటికీ తప్పుడు…
కోర్టులోనే దారుణం జరిగింది.. ఓ లాయర్ ను నాటు తుపాకితో కాల్చి చంపారు దుండగులు… ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపుతోంది.. పూర్తి వివరాల లోకి వెళ్తే షాహజన్‌పూర్ జిల్లా కోర్టులో భూపేంద్ర ప్రతాప్ సింగ్ అనే లాయర్‌ను కోర్టు లోపలే కాల్చి చంపారు. ఆయన మృతదేహం పక్కన దేశీయంగా తయారు చేసిన నాటు తుపాకీ దొరికినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం కోర్టులో భారీగా పోలీసులు మోహరించారు. అయితే పోలీసు భద్రతా లోపం వల్లే…
కొద్ది రోజుల నుంచి ఉత్తర ప్రదేశ్‌లో మార్మోగుతున్న పేరు..ప్రియాంకా గాంధీ. హింసాకాండ జరిగిన లఖింపూర్ వెళుతుండగా మార్గ మధ్యలో సీతాపూర్ వద్ద యూపీ పోలీసులు ఆమెను ఆదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అనంతరం ఆమెను ఉంచిన గెస్ట్ హౌస్ గదిని చీపురు పట్టి ఆమే శుభ్రం చేసుకున్నారు. అదే సమయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. తరువాత సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి లఖింపూర్ వెళ్లారు. శుక్రవారం స్థానిక వాల్మీకి కాలనీలో మళ్లీ చీపురుతో కనిపించారు. ఈసారి ఆమె రోడ్డు…