మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.. అయోధ్యలో ఈ నెల 9వ తేదీన జరగాల్సిన సమాజ్ వాదీ పార్టీ విజయ రథయాత్ర రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.. అంతేకాకుండా జనవరి 7 మరియు జనవరి 8న ఉత్తరప్రదేశ్లోని గోండా మరియు బస్తీలలో తన ఇతర ర్యాలీలను కూడా రద్దు చేసుకున్నారు అఖిలేష్.. కాగా, యూపీలో…
యూపీలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా యోగి సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. జనవరి 6 వ తేదీ నుంచి జనవరి 14 వరకు సెలవులు ప్రకటించింది. యూపీలో యాక్టీవ్ కేసులు 3 వేలు దాటటంతో ఈ నిర్ణయం తీసుకున్నది. అంతేకాకుండా నైట్ కర్ఫ్యూ సమయాన్ని కూడా ప్రభుత్వం పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలులో ఉన్న కర్ఫ్యూను మరో రెండు గంటలు పొడిగించింది. రాట్రి 10…
త్వరలో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ఆ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు మాటల యుద్ధానికి తెరలేపాయి. తాజాగా సమాజ్వాదీ పార్టీ నేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూపీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రామరాజ్యాన్ని స్థాపిస్థానని శ్రీకృష్ణుడు ప్రతిరోజూ తన కలలోకి వచ్చి చెప్తున్నాడని అఖిలేష్ వ్యాఖ్యానించారు. రామరాజ్యానికి సామ్యవాదమే మార్గమని… సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి వచ్చినరోజు రాష్ట్రంలో రామరాజ్యం ఏర్పడుతుందని…
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.. నిరసన తెలుపుతున్న రైతులపై వాహనం దూసుకుపోగా, నలుగురు రైతులు సహా ఎనిమిదిమంది మృత్యువాతపడడం దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే.. అయితే, కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రానే వాహనంతో రైతులపైకి దూసుకెళ్లారనే ఆరోపణలు రావడం.. ఆ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సంచలన విషయాలు బయటపెట్టింది.. రైతులను చంపాలన్న పక్కా ప్రణాళికతోనే వాహనం నడిపారని సిట్ తన లేఖలో పేర్కొంది.. నిర్లక్ష్యం కారణంగా…
ఉత్తరప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్నందున రాజకీయ పార్టీలు ఓట్ల వేటలో పడ్డాయి. ప్రధాన పార్టీలైన బీజేపీ, సమాజ్వాదీ పార్టీలు కుల రాజకీయాలలో బిజీగా ఉన్నాయి. కుల ప్రాతిపదిక ఏర్పడిన చిన్న పార్టీల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నిస్తున్నాయి. వాటితో పొత్తు పెట్టుకుని 2022 అసెంబ్లీ పోరుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఉత్తర ప్రదేశ్లో మహిళా ఓటర్లపై దృష్టి కేంద్రీకరించారు. గత కొన్ని నెలల నుంచి మహిళా ఓటర్లే లక్ష్యంగా ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అంతేకాదు,…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉత్తర ప్రదేశ్పై ప్రధాని మోదీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు యూపీలోని ప్రయాగ్ రాజ్లో ప్రధాని మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా స్వయం సహాయక మహిళా సంఘాల ఖాతాలకు రూ.వెయ్యి కోట్లను ప్రధాని మోదీ బదిలీ చేశారు. ప్రయాగ్ రాజ్ పవిత్ర గంగా, యుమన, సరస్వతి నదుల సంగమ స్థలి అని మోదీ ప్రస్తుతించారు. వేలాది సంవత్సరాల మన మాతృ శక్తికి ప్రతీకగా దానిని…
ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది యూపీలో నేతలు అప్పుడే ఓటర్లను ఆకర్షించేందుకు ప్రలోభాల పర్వాలు మొదలెట్టేశారు. ప్రతిపక్షాలు, అధికార పక్షం ఇప్పటికే ఎన్నికల ర్యాలీలు, సభలతో ఓటర్లను ఆకర్షించేందుకు చేయని ప్రయత్నం లేదు. ఈ ఎన్నికలు బీజేపీకి, కాంగ్రెస్కు కీలకం కావడంతో ఎవ్వరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. మరోవైపు బీఎస్పీ, ఎస్పీ పార్టీలు కూడా ఎన్నికల్లో గెలిచేందుకు కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. యూపీలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రలోభాలకు తెరలేపింది. యూపీ సీఎం యోగి…
ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకొంది. ప్రేమించిన బాలిక పెళ్ళికి నిరాకరించిందని ఆమెపై దారుణానికి ఒడిగట్టాడు ప్రియుడు.. తన స్నేహితుడితో కలిసి ఆమెకు మత్తుమందు ఇచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాలలోకి వెళితే.. నాగల్ జిల్లాకు చెందిన ఒక బాలిక పదో తరగతి చదువుతోంది.. అదే గ్రామానికి చెందిన యువకుడితో గత కొన్నిరోజుల నుంచి ప్రేమ వ్యవహారం నడుపుతోంది. ఇక ఇటీవల ప్రియుడు, బాలిక వద్ద పెళ్లి గురించి ప్రస్తావన తెచ్చాడు.. దానికి…
యూపీ సమరానికి సమయం దగ్గర పడుతోంది. పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రకటనకు ప్రచారం హోరెత్తుతోంది. ప్రస్తుతం యూపీలో టోపీ రాజకీయం నడుస్తోంది. సమాజ్వాద్ పార్టీ ఎర్ర టోపీ కేంద్రంగా రాజకీయ చర్చ నడుస్తోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీ ప్రసంగానికి ఎర్ర టోపీ ధరించిన ఎస్పీ ఎమ్మెల్యేలు అడ్డుకోవటంతో వివాదం మొదలైంది. క్యాప్ పెట్టుకున్న సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలు గుండాలు అనే అర్థం వచ్చేలా యోగీ ఎగతాళి చేయటంతో వారు సభలో అలజడి సృష్టించారు. ఇక,…