అశ్లీల వీడియోలు చూసి.. మూడేళ్ల బాలికపై 13 ఏళ్ళ బాలుడి అఘాయిత్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్మార్ట్ ఫోన్ల వలన ఎంతోమంది తప్పుదారి పడుతున్నారు. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరు స్మార్ట్ ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు. ఇక ఇటీవల కరోనా వలన పిల్లలందరికీ స్మార్ట్ ఫోన్లు అవసరంగా మారిపోవడంతో తల్లిదండ్రులు సైతం వారికి ఫోన్లను కొనిస్తున్నారు . అయితే వారు మాత్రం ఫోన్ లను చదువుకోవడానికి కాకుండా గేమ్స్ కోసం, అశ్లీల వీడియోలను చూడడానికి ఉపయోగిస్తున్నారు. తాజాగా ఒక 13 ఏళ్ల బాలుడు అశ్లీల వీడియోలకు అలవాటు పడి మూడేళ్ల బాలికపై అఘాయిత్యని ఒడిగట్టిన ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది.
వివరాలలోకి వెళితే.. కాన్పూర్ కి చెందిన ఒక జంట వ్యవసాయ పనులు చేసుకొంటూ బతుకుతుంది.. వారికి మూడేళ్ల పాప ఉంది. వారింటి పక్కనే ఒక 13 ఏళ్ల బాలుడు కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతడికి ఆన్లైన్ క్లాసులకు తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు. బాలుడు మాత్రం క్లాసులు పూర్తయ్యాకా ఫోన్ లో అశ్లీల వీడియోలు చూడడం మొదలుపెట్టాడు. అలా వాటికి బానిసగా మారాడు. ఈ నేపథ్యంలోనే సోమవారం సాయంత్రం పక్కింటి చిన్నారిని ఇంటిముందు ఆడుకోవడం చూసి.. ఆమెకు చాక్లెట్ ఇస్తానని చెప్పి ఇంట్లోకి రమ్మన్నాడు. చిన్నారి వెళ్ళాక ఆమెపై అత్యాచారం చేశాడు.
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
అనంతరం చిన్నారి ఇంటికి ఏడుస్తూ వెళ్లడం .. నొప్పిగా ఉందని తల్లికి చెప్పడంతో అస్సలు విషయం బయటపడింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే బాలుడు పరారు కావడంతో అతని ఫోన్ ని పోలీసులు స్వాధీనం చేసుకొని చూడగా ఫోన్ నిండా అశ్లీల వీడియోలు కనిపించాయి. వాటి ప్రభావంతోనే బాలుడు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తాజావార్తలు
-
Congress: ప్రధాని మోదీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ 5 డిమాండ్లు..
-
Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
-
UP Election 2027: ‘‘5 తరాల వరకు ప్రధాని కాలేరు’’.. గాంధీ కుటుంబంపై ఎస్పీ నేత సెటైర్లు..
-
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
-
Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!