ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉత్తర ప్రదేశ్‌పై ప్రధాని మోదీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో ప్రధాని మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా స్వయం సహాయక మహిళా సంఘాల ఖాతాలకు రూ.వెయ్యి కోట్లను ప్రధాని మోదీ బదిలీ చేశారు. ప్రయాగ్ రాజ్ పవిత్ర గంగా, యుమన, సరస్వతి నదుల సంగమ స్థలి అని మోదీ ప్రస్తుతించారు. వేలాది సంవత్సరాల మన మాతృ శక్తికి ప్రతీకగా దానిని మోదీ అభివర్ణించారు. నేడు ఈ పవిత్ర పట్టణం మహిళలు, వారి శక్తికి ప్రతీకగా నిలుస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
Read Also: మ్యారేజ్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం
సుమారు 1.6 లక్షల మహిళా సంఘాల ఖాతాలకు వెయ్యి కోట్ల రూపాయలను బదిలీ చేయడాన్ని గర్వకారణంగా మోదీ పేర్కొన్నారు. కొంత కాలం క్రితం వరకు కనీసం బ్యాంకు ఖాతాలు కూడా లేని మహిళలు ఈరోజు డిజిటల్ బ్యాంకింగ్ శక్తిని అందిపుచ్చుకుంటున్నట్టు చెప్పారు. యావత్ దేశం యూపీ అభివృద్ధి వైపు చూస్తోందన్నారు. మరోవైపు ఆడశిశువులను గర్భంలోనే చంపేస్తున్న ఈ రోజుల్లో బేటీ బచావో బేటీ బడావో ప్రచారం ద్వారా సమాజంలో అవగాహన తెచ్చి దేశంలో మహిళల సంఖ్యను పెరిగేలా చర్యలు తీసుకున్నామని మోదీ తెలిపారు. కాగా యూపీ పర్యటనలో ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
Addressing a programme in Prayagraj. #NariShaktiDeshKiShakti https://t.co/2njX6mz9zB
— Narendra Modi (@narendramodi) December 21, 2021