ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది యూపీలో నేతలు అప్పుడే ఓటర్లను ఆకర్షించేందుకు ప్రలోభాల పర్వాలు మొదలెట్టేశారు. ప్రతిపక్షాలు, అధికార పక్షం ఇప్పటికే ఎన్నికల ర్యాలీలు, సభలతో ఓటర్లను ఆకర్షించేందుకు చేయని ప్రయత్నం లేదు. ఈ ఎన్నికలు బీజేపీకి, కాంగ్రెస్‌కు కీలకం కావడంతో ఎవ్వరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. మరోవైపు బీఎస్పీ, ఎస్పీ పార్టీలు కూడా ఎన్నికల్లో గెలిచేందుకు కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. యూపీలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రలోభాలకు తెరలేపింది.
యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ కీలక ప్రకటన చేశారు. రాష్ర్టంలో కోటి మంది విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్‌లు అందజేయనున్నట్టు ప్రకటించారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి జయంతి సందర్భంగా డిసెంబర్ 25న తొలిదశ పంపిణీ చేపడతామని పేర్కొన్నారు. కాగా ఇటీవల రాయ్‌బరేలీలో ప్రచారం నిర్వహించిన మాజీ సీఎం అఖిలేష్ యాదవ్.. యోగి పై విమర్శలు చేశారు. యోగికి ల్యాప్‌టాప్ ఎలా వాడాలో తెలియదని, అందుకే వాటిని విద్యార్థులకు పంపిణీ చేయడం లేదని ఎద్దేవా చేశారు.
Read Also: