India vs England: సెమీఫైనల్లో సంజు శాంసన్ విశ్వరూపం.. సెంచరీ చేజారిన చెరిగిపోని రికార్డు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs England: వెస్టిండీస్‌తో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో 97 పరుగులతో అజేయంగా నిలిచి భారత్‌కు సెమీఫైనల్ టికెట్ అందించిన సంజు శాంసన్, ఇప్పుడు ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లోనూ అదే ఫామ్‌ను కొనసాగించాడు. “తర్వాత ఏమిటి?” అని ప్రశ్నించిన విమర్శకులకు తన బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. కేవలం 11 పరుగుల దూరంలో సెంచరీ చేజారినప్పటికీ, అతను ఆడిన 89 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ టీమిండియా చరిత్రలో నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
READ ALSO: India vs England: రఫ్ఫాడించిన సంజు, దూబే.. ఇంగ్లాండ్ ముందు భారీ టార్గెట్
Also Read
- AP Municipal Elections: తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ గురుమూర్తి చేతిలోని నామినేషన్ పత్రాలు లాక్కెళ్లిన టీడీపీ నేతలు..!
- భారత్‌లో అత్యధిక మైలేజ్ ఇచ్చే హైబ్రిడ్ ఎస్యూవీ.. Renault Duster Hybrid లాంచ్.. ధర, ఫీచర్స్, ఫుల్ డీటెయిల్స్ ఇవే..
- Supreme Court: పిల్లలకు ఇంటర్నెట్ వినియోగం ప్రాథమిక హక్కు.. నిషేధానికి సుప్రీంకోర్టు నిరాకరణ!
- AP Municipal Elections 2026: బెజవాడలో కూటమి పార్టీల మధ్య సీట్ల చిచ్చు.. జనసేన, బీజేపీ డిమాండ్లతో ఉత్కంఠ
ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ 89 పరుగులు..
ఇంగ్లాండ్ బౌలర్లను ఊచకోత కోస్తూ సంజు శాంసన్ కేవలం 42 బంతుల్లో 89 పరుగులు సాధించాడు. ఇందులో 8 ఫోర్లు, 7 భారీ సిక్సర్లు ఉన్నాయి. 211.90 స్ట్రైక్ రేట్‌తో సాగిన ఈ ఇన్నింగ్స్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. టీ20 ఇంటర్నేషనల్ కెరీర్‌లో సంజుకు ఇది 5వ హాఫ్ సెంచరీ కాగా, ఈ వరల్డ్ కప్‌లో వరుసగా రెండో భారీ స్కోరు. ఈ టోర్నీలో సంజు శాంసన్ గణాంకాలు చూస్తుంటే కళ్లు చెదిరిపోతున్నాయి. ఇప్పటివరకు ఆడిన 4 ఇన్నింగ్స్‌ల్లో 232 పరుగులు చేశాడు. 77.33 సగటుతో భారత్ తరపున అత్యధిక సగటు కలిగిన బ్యాటర్‌గా నిలిచాడు. 201.73 స్ట్రైక్ రేట్‌తో టోర్నీలోనే అత్యంత వేగంగా పరుగులు చేస్తున్న ఇండియన్ బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు 16 సిక్సర్లు బాది, భారత్ తరపున ‘మోస్ట్ సిక్స్ హిట్టర్’గా నిలిచాడు. సెమీఫైనల్లో 89 పరుగుల వద్ద అవుట్ అవ్వడంతో తృటిలో నాలుగో సెంచరీ మిస్ అయినప్పటికీ, సంజు శాంసన్ ఆడిన ఈ నాక్ టీమిండియాకు బలమైన స్కోర్‌ను అందించడంలో విశేషంగా సహాయపడిందని విశ్లేషకులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Double Diabetes: మీకు డబుల్ డయాబెటిస్ ఉందా?
-
Destiny : కామెడీ వదిలేసి.. అడవిలో జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్!
-
WHO: ఇంట్లోనే విషం? 35లక్షల మరణాలకు కారణం ఇదే!
-
AP Municipal Elections: తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ గురుమూర్తి చేతిలోని నామినేషన్ పత్రాలు లాక్కెళ్లిన టీడీపీ నేతలు..!
-
భారత్‌లో అత్యధిక మైలేజ్ ఇచ్చే హైబ్రిడ్ ఎస్యూవీ.. Renault Duster Hybrid లాంచ్.. ధర, ఫీచర్స్, ఫుల్ డీటెయిల్స్ ఇవే..
ట్రెండింగ్
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?