ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకొంది. ప్రేమించిన బాలిక పెళ్ళికి నిరాకరించిందని ఆమెపై దారుణానికి ఒడిగట్టాడు ప్రియుడు.. తన స్నేహితుడితో కలిసి ఆమెకు మత్తుమందు ఇచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాలలోకి వెళితే.. నాగల్ జిల్లాకు చెందిన ఒక బాలిక పదో తరగతి చదువుతోంది.. అదే గ్రామానికి చెందిన యువకుడితో గత కొన్నిరోజుల నుంచి ప్రేమ వ్యవహారం నడుపుతోంది. ఇక ఇటీవల ప్రియుడు, బాలిక వద్ద పెళ్లి గురించి ప్రస్తావన తెచ్చాడు.. దానికి బాలిక ససేమిరా ఒప్పుకోలేదు.
తనకి ఇంకా 16 ఏళ్లేనని , ఇప్పుడే పెళ్లి చేసుకోవడం కుదరదని చెప్పింది. ఈ విషయం ముందుగానే ఊహించిన ప్రియుడు తన ఫ్రెండ్ తో కలిసి స్కెచ్ వేశాడు.. ఆమె వచ్చేసరికి ముందుగానే మత్తు మందు కలిపిన బర్గర్ ని తినమని చెప్పాడు. బాలిక అది తిని స్పృహ కోల్పోగా ఆమెపై ఇద్దరు స్నేహితులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాలిక నగ్న వీడియోలను తీసి ఆమెను బెదిరించడం మొదలుపెట్టారు.. దీంతో ప్రియుడు వేధింపులు తట్టుకోలేని బాలిక పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.