దేశవ్యాప్తంగా సంచలనం రేపిన.. లఖింపూర్ ఘటనలో కీలక నిందితుడిగా ఉన్న కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు… ఆశిష్ మిశ్రా ఆచూకీ ఇంకా తెలియలేదు. అతను ఎక్కడున్నాడనే దానిపై స్పష్టత కొరవడింది. క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి హాజరు కావాలంటూ జారీ చేసిన నోటీసులకూ ఆశిష్ స్పందించలేదు. ఇవాళ ఉదయం పదింటికి.. క్రైం బ్రాంచ్లో విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ.. అతను రాకపోవడంతో ఎక్కడున్నాడనే ఉత్కంఠ నెలకొంది. ఆశిష్ మిత్రా ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడనే విషయం.. ఎవరికీ తెలియడం లేదు. పోలీసులు…
ఉత్తరప్రదేశ్లోని లఖింపుర్ ఖేరి ఘటనపై మరోసారి విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. యూపీ సర్కార్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది… యూపీ సర్కార్ చేపట్టిన చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. నిందితులను ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఈ ఘటనపై దసరా తర్వాత తదుపరి విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించిన సుప్రీంకోర్టు.. అయితే, అప్పటి వరకు అన్ని సాక్ష్యాలను పరిరక్షించాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.…
త్వరలోనే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సెమిఫైనల్ గా భావిస్తున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపీలు తిరిగి తమ ప్రభుత్వాలను కాపాడుకునేందుకు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండగా ఒక రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇక దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అధికారంలో ఉంది. ఇక్కడ అధికారాన్ని కాపాడుకోవడం ఆపార్టీకి కత్తి మీద…
దేశంలో రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు, రూల్స్ తీసుకువచ్చినా.. రోడ్డు ప్రమాదాల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. అతి వేగం, మద్యం సేవించి.. వాహనాలు నడపడం కారణంగా ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక తాజాగా ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బారాబంకిలో బస్సు,ట్రక్కు ఒకదానికొకటి ఢీకొన్నాయ్. ఈప్రమాదంలో 9 మంది దుర్మరణం చెందారు.మరో 27 మందికి తీవ్రగాయాలయ్యాయ్. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బస్సు ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్లోని…
లఖింపూర్ ఘటనపై రైతులు మండిపడుతున్నారు. అటు, ప్రతిపక్షాలు కూడా ఈ విషయంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం లఖింపూర్లోకి ఎవర్నీ అనుమతించడం లేదు. 144 సెక్షన్ను అమలు చేస్తున్నారు. అయితే, లఖింపూర్ ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకున్నది. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించబోతున్నది. సీబీఐ చేత విచారణ చేయించాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతు…
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. లఖింపూర్ ఘటనపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రైతులు మండిపడుతున్నారు. అటు ప్రతిపక్షాలు సైతం యూపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. ప్రభుత్వాలు రైతుల హక్కుల్ని కాలరాస్తున్నాయని రాహుల్ గాంధీ విమర్శించారు. లఖింపూర్ ఘటనలో కేంద్రమంత్రి కొడుకును ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. నిన్న యూపీ వెళ్లిన ప్రధాని లఖింపూర్ వెళ్లి బాధితులను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. తాము లఖింపూర్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని, 144 సెక్షన్…
రాజకీయంగా దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. వచ్చే ఏడాది ఇక్కడ ఎన్నికలు జరగున్నాయి. దశాబ్దాల పాటు యూపీని పాలించిన కాంగ్రెస్ ఇప్పుడు అక్కడ నామ మాత్రంగా మిగిలిపోయింది. కానీ గాంధీ-నెహ్రూ కుటుంబం అంటే ఇప్పటికీ యూపీ ప్రజలలోఎంతో కొంత గౌరవం..పలుకుబడి మిగిలే వుంది. అయితే కులాల వారిగా ఓట్లు చీలిపోవటంతో హస్తం పార్టీకి అవకాశం లేకుండా పోతోంది. మూడు దశాబ్దాల నుంచి అంతకంతకు పడిపోతున్న పార్టీ ప్రతిష్టను పెంచే బాధ్యతను ప్రియాంక గాంధీ తీసుకున్నారు. ఇప్పుడు…
కేంద్ర రైతు చట్టాలకు వెతిరేకంగా చేస్తున్న ఆందోళనలో 450 మంది రైతులు అమరులయ్యారు. రైతులను నాశనం చేసినవాళ్ళు… రాజకీయ ఎదిగిన వాళ్ళు లేరు చరిత్రలో లేరు అని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ జయంతి రోజు శాంతి యుతంగా నిరసన తెలియజేస్తున్న రైతుల. పైకి కేంద్రమంత్రి కొడుకు అధికార దాహంతో నాలుగు రైతులను తిక్కి చంపారు. అజయ్ మిశ్రా మాటల వెనుక కేంద్ర హోమ్ అమిత్షా ఉన్నారు. అజయ్ మిశ్రాను అరెస్టు చేయడంలో…
ఉత్తర ప్రదేశ్లో లఖీంపూర్ ఖేరి ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. లఖీంపూర్ ఖేరీ లో నిరసనలు చేపడుతున్న రైతుల మీదకు కేంద్రమంత్రి ఆశిశ్ మిశ్రా కుమారుడు కారుతో యాక్సిడెంట్ చేశాడని, ఈ ఘటనలో 4 రైతులు మృతి చెందారని, అనంతరం జరిగిన అల్లర్లలో మరో నలుగురు మృతి చెందారని ఆరోపణలు. దీంతో కేంద్రమంత్రి ఆశిశ్ మిశ్రపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు లఖీంపూర్ ఖేరీ వైపు ఎవర్నీ వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. అయితే, లఖీంఫూర్ ఘటన…
ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీలో జరిగిన హింస దురదృష్టకరమని సోమవారం విచారం వ్యక్తం చేసింది సుప్రీం కోర్టు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎవరూ బాధ్యత వహించరని విచారం వ్యక్తం చేసింది అత్యున్నత న్యాయస్థానం. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన (సత్యాగ్రహం ) నిర్వహించడానికి అనుమతి కోరుతూ “కిసాన్ మహాపంచాయత్” దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపింది సుప్రీంకోర్టు. అయితే లఖింపూర్ ఖేరి లాంటి సంఘటనలు నిరోధించేందుకు, ఏలాంటి నిరసన ప్రదర్శనలకు అనుమతించరాదని కేంద్రం తరఫున హాజరైన…