ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది.. సమాజ్‌వాది పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ఎస్పీ నేతలు తలకు పెట్టుకునే ఎరుపు టోపీనే టార్గెట్ చేసిన ఆయన.. ముజఫర్‌నగర్ అల్లర్ల సమయంలో 60 మందికి పైగా హిందువులను ఊచకోత కోశారని ఆరోపణలు గుప్పించారు.. ఇదే సమయంలో 1500 మందికి పైగా హిందువులను జైళ్లలో పెట్టారని.. సమాజ్‌వాదీ పార్టీ టోపీని అమాయక రామభక్తుల రక్తంతో పెయింట్ చేశారంటూ వ్యాఖ్యానించారు.. ఇక, ఎస్పీ అభ్యర్థులను టార్గెట్ చేసిన సీఎం యోగి.. నేరగాళ్లకు వాళ్లు అఖిలేష్ యాదవ్ టిక్కెట్లు ఇచ్చారని విమర్శించారు.. కాగా, యూపీ ఎన్నికల సమయంలో.. బీజేపీ, ఎస్పీ, కాంగ్రెస్ నుంచి కీలక నేతలు వలసవెళ్లిన విషయం తెలిసిందే.
Read Also: తెలంగాణలో స్కూళ్ల రీఓపెన్.. విద్యాశాఖ మంత్రి ప్రకటన