బర్త్‌డే వేడుకలను మామూలు మనుషులు ఘనంగా జరుపుకుంటుంటారు. ప్రతీ ఏడాది పుట్టిన తేదీని గుర్తుపెట్టుకొని వేడుకలు చేసుకుంటారు. అయితే, కొంతమంది తమ పెంపుడు జంతువులకు కూడా అప్పుడప్పుడు పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తుంటారు. యూపీలోని దుద్వా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఇటీవలే అటవీశాఖ అధికారులు ఓ చిన్న ఏనుగుకు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. చిన్న గున్న ఏనుగు జన్మించి ఏడాదైన సందర్భంగా ఫారెస్ట్ అధికారులు ఈ వేడుకను నిర్వహించారు. అంతేకాదు, ఆ చిన్న గున్న ఏనుగుకు పేరు పెట్టేందుకు ఆన్‌లైన్‌లో ప్రకటన ఇవ్వగా సుమారు 200 మంది పేర్లను పంపారు. వాటిల్లో నుంచి మష్కలీ అనే పేరును సెలక్ట్ చేసి ఆ గున్న ఏనుగుకు నామకరణం చేశారు. ఇక పుట్టినరోజు సందర్భంగా మష్కలీ కోసం పెద్ద ఎత్తున చెరుకుగడలు, బెల్లంను తీసుకొచ్చి ఏనుగుకు తినిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.