ఉత్తరప్రదేశ్ ఓ మహిళ తన కూతురికోసం ఏకంగా చిరుతతో ఫైట్ చేసింది. ప్రాణాలకు తెగించి చిరుతతో పోరాడి కూతురిని కాపాడుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో నాన్‌పారా అటవీప్రాంతంలో జరిగింది. నాన్‌పారా అటవీప్రాంతంలోని గిర్దా గ్రామంలో చిరుత ప్రవేశించి ఇంటిముందు ఆకుకుంటున్న ఆరేళ్ల చిన్నారిపై దాడిచేసింది. ఆ చిన్నారికి ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించింది. చిన్నారి కేకలు విన్న తల్లి రీనా కర్ర చేత పట్టుకొని అక్కడికి వచ్చింది. కర్రతో చిరుతపై తిరగబడింది. మహిళ దెబ్బలకు తాళలేక ఆ చిరుత అక్కడి నుంచి పారిపోయింది. చిరుత దాడిలో బాలిక తలకు గాయాలయ్యాయి. వెంటనే చిన్నారిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం జిల్లా ఆసుపత్రికి తరలించారు.
Read: ఆనంద్ మహీంద్రా ట్వీట్‌తో బిజీగా మారిన ఆ పిల్లల రెస్టారెంట్…