తాను వ్యాపారంలో నష్టపోవడానికి ఆర్థికంగా చితికిపోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ కారణమంటూ యూపీలో ఓ చిరువ్యాపారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ మేరకు ఫేస్‌బుక్ లైవ్‌లోనే విషం తాగాడు. వ్యాపారితో పాటు ఆయన భార్య కూడా విషం తాగింది. ఈ ఘటనలో భార్య చనిపోయింది. వ్యాపారి రాజీవ్ పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఫేస్‌బుక్ లైవ్‌లో ప్రధాని మోదీపై వ్యాపారి రాజీవ్ తీవ్ర ఆరోపణలు చేశాడు. నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల తాను అప్పుల పాలయ్యానని ఆవేదన వ్యక్తం చేశాడు.
ప్రధాని మోదీకి చేతనైతే పరిస్థితులు చక్కదిద్దాలని వ్యాపారి రాజీవ్ హితవు పలికాడు. రైతులు, చిన్న వ్యాపారులకు మోదీ ఎంతమాత్రమూ హితుడు కాదని అభిప్రాయపడ్డాడు. 2020లో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ వల్ల తాను మరింత నష్టపోయినట్లు రాజీవ్ వివరించాడు. లాక్‌డౌన్ కారణంగా రుణాలు చెల్లించలేకపోయానని వాపోయాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెంది లైవ్‌లోనే విషం తాగగా.. అతడి భార్య అడ్డుకునే ప్రయత్నం చేసింది. ప్రభుత్వం తన మాట వినడం లేదు.. కనీసం నువ్వైనా తన మాట వినాలని భార్యతో చెప్తూ ఆవేశంగా విషం తాగేశాడు. భర్త విషం తాగడంతో భార్య కూడా వెంటనే విషం తీసుకుంది. రాజీవ్ పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ఘటనపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ స్పందించారు. రాజీవ్ మృతి కలచివేస్తోందని తెలిపారు. రాజీవ్ భార్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
నా మరణానికి కారణం నరేంద్ర మోదీ నే ,
— krishanKTRS (@krishanKTRS) February 10, 2022
మోదీ నిర్ణయాల వల్ల రైతులకు, చిరు వ్యాపారులకు ఇబ్బందులు..
– ఆత్మహత్యాయత్నం చేసుకున్న బిజెపి కార్యకర్త pic.twitter.com/MgmYNJqhyZ