ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఈరోజు నుంచి ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. ఈరోజు మొదటిదశ ఎన్నికలు జరిగాయి. మొత్తం 11 జిల్లాల్లోని 58 అసెంబ్లీ నియోజక వర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 7గంటల నుంచి పోలింగ్ ప్రారంభం అయింది. అయితే, మొదటిదశ ఎన్నికల్లో నోయిడాకు చెందిన ఓ వ్యక్తి అందర్నీ అకట్టుకున్నాడు. యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ తరహా వేషధారణ ధరించిన ఓ వ్యక్తి ఓటు వేసేందుకు పోలింగ్ నోయిడాలోని సెక్టార్ 11 పోలింగ్ బూత్ వద్దకు వచ్చాడు. ఆయన్ను చూసిన ఓటర్లు మొదట సాక్ అయ్యారు. సీఎం పోలికలతో ఉండతంతో పాటు యోగి ఆదిత్యనాథ్ మాదిరిగానే వేషధారణ కూడా ఉండటంతో ఓటర్లు ఆశ్చర్యపోయారు. రాజు కోహ్లీతో సెల్ఫీలు దిగేందుకు ఓటర్లు ఆసక్తి కనబరిచారు. దీనికి సంబంధించిన వీడియోను ఏఎన్ఐ ట్విట్టర్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.
Read: RBI: క్రిఫ్టోకరెన్సీపై ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు… తులిప్ పువ్వుతో పోలుస్తూ…
#WATCH | Raju Kohli, a youth dressed as CM Yogi Adityanath arrived at a polling booth in Sector 11 of Noida to cast his vote for #UttarPradeshElections2022 pic.twitter.com/3o5gTH6b3q
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 10, 2022