ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఈరోజు నుంచి ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. ఈరోజు మొదటిదశ ఎన్నికలు జరిగాయి. మొత్తం 11 జిల్లాల్లోని 58 అసెంబ్లీ నియోజక వర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 7గంటల నుంచి పోలింగ్ ప్రారంభం అయింది. అయితే, మొదటిదశ ఎన్నికల్లో నోయిడాకు చెందిన ఓ వ్యక్తి అందర్నీ అకట్టుకున్నాడు. యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ తరహా వేషధారణ ధరించిన ఓ వ్యక్తి ఓటు వేసేందుకు పోలింగ్ నోయిడాలోని సెక్టార్ 11 పోలింగ్ బూత్ వద్దకు వచ్చాడు. ఆయన్ను…
తాను వ్యాపారంలో నష్టపోవడానికి ఆర్థికంగా చితికిపోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ కారణమంటూ యూపీలో ఓ చిరువ్యాపారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ మేరకు ఫేస్బుక్ లైవ్లోనే విషం తాగాడు. వ్యాపారితో పాటు ఆయన భార్య కూడా విషం తాగింది. ఈ ఘటనలో భార్య చనిపోయింది. వ్యాపారి రాజీవ్ పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఫేస్బుక్ లైవ్లో ప్రధాని మోదీపై వ్యాపారి రాజీవ్ తీవ్ర ఆరోపణలు చేశాడు. నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల తాను అప్పుల పాలయ్యానని ఆవేదన వ్యక్తం…
ఈనెల 10 వ తేదీన ఉత్తరప్రదేశ్లో తొలివిడత ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. కరోనా నిబంధనలను అమలు చేస్తూ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఉత్తరప్రదేశ్ తొలివిడత ఎన్నికల సందర్భంగా ఫిబ్రవరి 8 నుంచి 10 వ తేదీ సాయంత్రం వరకు ఎన్నికలు జరిగే నియోజక వర్గాల్లో మందుషాపులను బంద్ చేస్తున్నారు. ఢిల్లీకి అతి సమీపంలో ఉన్న నోయిడా, ఘజియాబాద్లలో లిక్కర్ షాపులు బంద్ అవుతున్నాయి. ఫిబ్రవరి 8 వ తేదీ…
బర్త్డే వేడుకలను మామూలు మనుషులు ఘనంగా జరుపుకుంటుంటారు. ప్రతీ ఏడాది పుట్టిన తేదీని గుర్తుపెట్టుకొని వేడుకలు చేసుకుంటారు. అయితే, కొంతమంది తమ పెంపుడు జంతువులకు కూడా అప్పుడప్పుడు పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తుంటారు. యూపీలోని దుద్వా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఇటీవలే అటవీశాఖ అధికారులు ఓ చిన్న ఏనుగుకు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. చిన్న గున్న ఏనుగు జన్మించి ఏడాదైన సందర్భంగా ఫారెస్ట్ అధికారులు ఈ వేడుకను నిర్వహించారు. అంతేకాదు, ఆ చిన్న గున్న ఏనుగుకు పేరు పెట్టేందుకు…
హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీని దుండగులు టార్గెట్ చేయడం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఒవైసీ.. ముఖ్యంగా యూపీలోకి కేంద్రీకరించి అభ్యర్థులను బరిలోకి దింపారు.. ఇదే సమయంలో ఒవైసీని టార్గెట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. యూపీలో ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఢిల్లీ వెళ్తున్న ఒవైసీ కారుపై కాల్పులు జరిపారు దుండగులు.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన ఆయన..…
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పులు జరిపారు దుండగులు.. ఉత్తరప్రదేశ్లో ఎన్నికల కార్యక్రమం ముగించుకుని తిరిగి ఢిల్లీ వెళ్తుండగా.. కాల్పులకు తెగబడ్డారు.. మీరట్లోని (ఉత్తరప్రదేశ్లోని) కితౌర్లో ఎన్నికల సంబంధిత కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఢిల్లీకి వెళ్తున్నాను.. కానీ, ఛిజర్సీ టోల్ పాజా వద్ద తన కారుపై కాల్పులు జరిపినట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు అసదుద్దీన్ ఒవైసీ.. ఈ ఘటనలో ముగ్గురు లేదా నలుగురు దుండగులు పాల్గొన్నట్టు పేర్కొన్న ఆయన.. తాను ప్రయాణిస్తున్న…
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది.. సమాజ్వాది పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ఎస్పీ నేతలు తలకు పెట్టుకునే ఎరుపు టోపీనే టార్గెట్ చేసిన ఆయన.. ముజఫర్నగర్ అల్లర్ల సమయంలో 60 మందికి పైగా హిందువులను ఊచకోత కోశారని ఆరోపణలు గుప్పించారు.. ఇదే సమయంలో 1500 మందికి పైగా హిందువులను జైళ్లలో పెట్టారని.. సమాజ్వాదీ పార్టీ టోపీని అమాయక రామభక్తుల రక్తంతో పెయింట్ చేశారంటూ వ్యాఖ్యానించారు..…
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తిక పరిణామాలు జరుగుతున్నాయి.. అన్నీ తానై ముందుడి యూపీ కాంగ్రెస్ బాధ్యతలను భుజానవేసుకుని ముందుకు వెళ్తున్నారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, యూపీ కాంగ్రెస్ ఇంఛార్జ్ ప్రియాంకా గాంధీ వాద్రా.. ఇప్పటికే బీజేపీ, ఎస్పీ సీఎం అభ్యర్థులు తేలిపోవడంతో.. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరు అనేది ప్రశ్నగా మారింది.. ఈ వ్యవహారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వరకు చేరింది.. ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను విడుదల చేసిన సమయంలో కాంగ్రెస్ సీఎం…