ఎన్నికలు వస్తే చాలు రాజకీయ పార్టీలు ప్రజలపై ఎక్కడ లేని ప్రేమను ఒలకబోస్తాయి. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలన్నీ హామీలిచ్చే పనిలో పడ్డాయి. తాజాగా యూపీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ కొత్త హామీని ప్రకటించింది. మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూపీలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఐదేళ్లపాటు ఉచిత రేషన్తో పాటు పేదలకు కిలో నెయ్యి ఇస్తామని ప్రకటించారు. పేదల…
దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉదయం 7 గంటలకు యూపీ, గోవా లో పోలింగ్ ప్రారంభం కాగా, ఉత్తరాఖండ్ లో ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. 3 రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉత్తరప్రదేశ్లో రెండో దశ పోలింగ్ జరుగుతుండగా, గోవా, ఉత్తరాఖండ్లో ఒకే విడతలో పోలింగ్ ముగియనుంది. అయితే మూడు రాష్ట్రాల్లో ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు.…
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దేశంలోని అన్నిరంగాలు తిరిగి తెరుచుకోవడంతో ఎన్నికల కమిషన్ ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలు, కరోనా కేసులు, బందోబస్తు తదితర విషయాలపై ఈరోజు మరోసారి రివ్యూ చేసింది. కరోనా కేసుల కారణంగా మొన్నటి వరకు పాదయాత్రలు, ర్యాలీలకు అనుమతులు ఇవ్వలేదు. తాజా రివ్యూ అనంతరం ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. పాదయాత్రలు, ర్యాలీలకు అనుమతులు మంజూరు చేసింది. అయితే, ర్యాలీలు, పాదయాత్రలకు జిల్లా అధికారుల పర్మీషన్ తప్పనిసరి చేసింది. అంతేకాదు,…
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఈరోజు నుంచి ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. ఈరోజు మొదటిదశ ఎన్నికలు జరిగాయి. మొత్తం 11 జిల్లాల్లోని 58 అసెంబ్లీ నియోజక వర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 7గంటల నుంచి పోలింగ్ ప్రారంభం అయింది. అయితే, మొదటిదశ ఎన్నికల్లో నోయిడాకు చెందిన ఓ వ్యక్తి అందర్నీ అకట్టుకున్నాడు. యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ తరహా వేషధారణ ధరించిన ఓ వ్యక్తి ఓటు వేసేందుకు పోలింగ్ నోయిడాలోని సెక్టార్ 11 పోలింగ్ బూత్ వద్దకు వచ్చాడు. ఆయన్ను…
తాను వ్యాపారంలో నష్టపోవడానికి ఆర్థికంగా చితికిపోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ కారణమంటూ యూపీలో ఓ చిరువ్యాపారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ మేరకు ఫేస్బుక్ లైవ్లోనే విషం తాగాడు. వ్యాపారితో పాటు ఆయన భార్య కూడా విషం తాగింది. ఈ ఘటనలో భార్య చనిపోయింది. వ్యాపారి రాజీవ్ పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఫేస్బుక్ లైవ్లో ప్రధాని మోదీపై వ్యాపారి రాజీవ్ తీవ్ర ఆరోపణలు చేశాడు. నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల తాను అప్పుల పాలయ్యానని ఆవేదన వ్యక్తం…
ఈనెల 10 వ తేదీన ఉత్తరప్రదేశ్లో తొలివిడత ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. కరోనా నిబంధనలను అమలు చేస్తూ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఉత్తరప్రదేశ్ తొలివిడత ఎన్నికల సందర్భంగా ఫిబ్రవరి 8 నుంచి 10 వ తేదీ సాయంత్రం వరకు ఎన్నికలు జరిగే నియోజక వర్గాల్లో మందుషాపులను బంద్ చేస్తున్నారు. ఢిల్లీకి అతి సమీపంలో ఉన్న నోయిడా, ఘజియాబాద్లలో లిక్కర్ షాపులు బంద్ అవుతున్నాయి. ఫిబ్రవరి 8 వ తేదీ…
బర్త్డే వేడుకలను మామూలు మనుషులు ఘనంగా జరుపుకుంటుంటారు. ప్రతీ ఏడాది పుట్టిన తేదీని గుర్తుపెట్టుకొని వేడుకలు చేసుకుంటారు. అయితే, కొంతమంది తమ పెంపుడు జంతువులకు కూడా అప్పుడప్పుడు పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తుంటారు. యూపీలోని దుద్వా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఇటీవలే అటవీశాఖ అధికారులు ఓ చిన్న ఏనుగుకు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. చిన్న గున్న ఏనుగు జన్మించి ఏడాదైన సందర్భంగా ఫారెస్ట్ అధికారులు ఈ వేడుకను నిర్వహించారు. అంతేకాదు, ఆ చిన్న గున్న ఏనుగుకు పేరు పెట్టేందుకు…
హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీని దుండగులు టార్గెట్ చేయడం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఒవైసీ.. ముఖ్యంగా యూపీలోకి కేంద్రీకరించి అభ్యర్థులను బరిలోకి దింపారు.. ఇదే సమయంలో ఒవైసీని టార్గెట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. యూపీలో ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఢిల్లీ వెళ్తున్న ఒవైసీ కారుపై కాల్పులు జరిపారు దుండగులు.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన ఆయన..…