హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై కాల్పులు వ్యవహారం సంచలనం సృష్టించింది.. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తిరిగి ఢిల్లీకి వెళ్తుండగా.. దుండగులు కాల్పులు జరిపారు.. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.. అయితే, దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం దర్యాప్తు జరపాలని కోరారు అసదుద్దీన్ ఒవైసీ.. దర్యాప్తు జరిపించే బాధ్యత ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఏ అన్నారు ఒవైసీ.. మరోవైపు.. యూపీలో ఒవైసీ వాహనంపై కాల్పుల ఘటనతో హైదరాబాద్‌లో పోలీసులు అప్రమత్తం అయ్యారు.. హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతాల్లో అలెర్ట్ అయిన పోలీసులు నిఘా కట్టుదిట్టం చేశారు.. ముందస్తు చర్యల్లో భాగంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీగా మోహరించారు పోలీసులు.. పాతబస్తీ చార్మినార్ మక్కా మసీద్ తదితర ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.. అందుబాటులో ఉన్న క్విక్ రియాక్షన్ టీమ్ మరియు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక, ఓల్డ్ సిటీలోని కొన్ని ప్రాంతాలను పరిశీలించారు సీపీ సీవీ ఆనంద్.. పోలీసులకు పలు కీలక సూచనలు చేశారు.
Read Also: టార్గెట్ ఒవైసీ… పోలీసుల అదుపులో నిందితుడు..