Kishan Reddy: కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తాజాగా కుటుంబ ఆస్తులు, అప్పులను మంత్రి పీఎంవో కార్యాలయానికి సమర్పించారు.
జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలల ముందు నిర్ణయించిన దిశా మీటింగ్‌కు అధికారులు హాజరు కాకపోవడంపై ఆయన మండిపడ్డారు.
Kishan Reddy: మహబూబ్ నగర్ లో జరిగే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ ర్యాలీ లో పాల్గొనేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బయలుదేరారు. ర్యాలీ అనంతరం అక్కడ జరిగే సభలో పాల్గొననున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో పురానా ఖిల్లాకు ఓ ప్రత్యేకత ఉంది అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆయన ఇవాళ ( మంగళవారం ) పురాతన ఖిల్లాను సందర్శించారు. గత చరిత్ర ఆధారాలు పురాణ ఖిల్లా వద్ద లభిస్తున్నాయి..
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని 5 రహదారులను (రిచర్డ్‌సన్ రోడ్, ప్రోట్నీ రోడ్, బయామ్ రోడ్, అమ్ముగూడ రోడ్, అల్బయిన్ రోడ్) సామాన్య ప్రజల వినియోగానికి తెరిచేందుకు రక్షణ శాఖ అనుమతించడం పట్ల కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇందుకుగానూ రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
Foreign Exchange: కరోనా ప్రపంచదేశాలను అతలాకుతలం చేసింది.. మళ్లీ కొన్ని దేశాలు మినహా చాలా దేశాల్లో సాధారణ పరిస్థితులు సారవడంతో.. విదేశీయానం పెరిగింది.. భారత్‌కు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. విదేశీ పర్యాటకుల ద్వారా 2022 ఆర్థిక సంవత్సరంలో దేశానికి ఒక లక్షా 34 వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం లభించిందని పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. రాజ్యసభలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు..…
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీకి వెల్లి మహిళా రిజర్వేషన్ బిల్లుపై పోరాడం ఏంటని, మీకు ఏ అధికారం ఉందంటూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం పై మండిపడ్డారు.
వరుస ప్రమాదాలు జరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం సంభవించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాల్లో భయాందోళన నెలకొందని తెలిపారు. సికింద్రాబాద్ లోనే వరుస ప్రమాదాలు జరగడం, ప్రాణ నష్టం జరగడం దురదృష్టకరమన్నారు.
సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి లేఖరాశారు. కేంద్ర ప్రభుత్వం “భారతమాల పరియోజన” కార్యక్రమం క్రింద జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణలో నిర్మించనున్న జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తి చేసి ఆయా రహదారుల నిర్మాణానికి సహకరించాలని కోరుతూ లేఖలో పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ కవితకి ఈడీ నోటీస్ ల పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఈడీ నోటీసులు ఇస్తే తప్పేంటి? అంటూ ప్రశ్నించారు. లిక్కర్ వ్యాపారం చేసింది మీరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.