బీజేపీపై తీవ్రంగా మండిపడ్డారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని.. కేంద్ర మంత్రులు ఢిల్లీలో ఉన్నప్పుడు ఒకతీరు.. హైదరాబాద్ వచ్చాకా ఇంకో తీరుగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ మీద ఏదో ఒక నింద వేయాలని కిషన్ రెడ్డి చూస్తున్నారని ఆయన అన్నారు.
హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో రాంజీ గోండు ట్రైబల్ మ్యూజియంకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా రామ్‌జీ గోండు పోరాడారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలు భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సి ఉందన్నారు.
కొమురవెల్లి మల్లన్న దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం మల్లన్న పాదాల చెంత రైల్వే స్టేషన్ నిర్మించాలని ప్రధాని మోడీ (PM Modi) ఆదేశించారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) తెలిపారు.
గుంటూరు రైల్వేస్టేషన్‌లో మూడు రైళ్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. నరసాపురం నుంచి హుబ్లీకి, గుంటూరు నుంచి విశాఖకు, రేణిగుంట నుంచి నంద్యాలకు మూడు రైళ్లను కేంద్రమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మూడు రైళ్లను ప్రారంభించామని, నంద్యాల నుంచి రేణిగుంట రైలు తిరుమల భక్తులకు ఎంతో ప్రయోజనంగా ఉంటుందని తెలిపారు
నరేంద్ర మోడీ ప్రభుత్వంలో చాలా వేగంగా రైల్వే అభివృద్ధి చెందింది.. స్విట్జర్లాండ్ తో సమానంగా నెట్వర్క్ అభివృద్ధి చేశాం.. 2004లో కాంగ్రెస్ హయాంలో రైల్వే బడ్జెట్ రూ.8000 కోట్ల నుంచి రూ. 29 వేల కోట్లకు పెరిగింది.. మోడీ ప్రభుత్వంలో బడ్జెట్ రూ.2.8 లక్షల కోట్ల చేరిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
కాంగ్రెస్ అంటేనే కరప్షన్ పార్టీ.. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 5 నెలలు కాలేదు అని కిషన్ రెడ్డి తెలిపారు. కానీ, 5 ఏండ్లకు సరిపడా వ్యతిరేకతను మూటగట్టుకుంటోంది.. ఛత్తీస్ గఢ్ లోన అవినీతి ఎక్కువైనందునే ఆ పార్టీని ఓడించారు.
Kishan Reddy: రాహుల్ గాంధీకి దమ్ము దైర్యం ఉంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని, రాహుల్ చర్చలు సిద్దమా? అని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి రాహుల్ కు సవాల్ విసిరారు.
Telangana BJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. రానున్న ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని జనసేన పార్టీని బీజేపీ కోరింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ భేటీ అయ్యారు.
Kishan Reddy: ఎన్నికల తరువాత కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఒక్కటై తెలంగాణకు శాపంగా మారుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు పోలీస్ లు వ్యవహరించినట్లు ఉద్యమ సమయంలో వ్యవహరిస్తే ఈ అన్నా చెల్లెళ్ళు అమెరికా పారి పోయేవారని సంచలన వ్యాక్యలు చేశారు.