కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై ప్రతి ఒక్కరూ ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బి ఆర్ ఎస్ పార్టీల నేతలు విచిత్రమైన మానసిక వ్యాధి తో బాధపడుతున్నారని అన్నారు. వాళ్లకు బిజెపి ఫోబియా పట్టుకుందన్నారు. చిల్లర మాటలు, అవగాహన లేకుండా, ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారని తెలిపారు. బిజెపికి తెలంగాణ లో ఎవరితో కలవాల్సిన అవసరం లేదన్నారు. కెసిఆర్, కేటీఆర్, బిఆర్ఎస్, కాంగ్రెస్ లతో బిజెపి…
తెలంగాణలో నేషనల్ హైవే ప్రాజెక్టులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. పీఎం నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణాలో జాతీయ రహదారులు అత్యంత వేగవంతంగా, సమర్థవంతంగా పురోగతి సాధిస్తున్నాయని తెలిపారు. 2500 కీ మీ మాత్రమే జాతీయ రహదారులు ఉండేవని.. ఈ పదేళ్లలో రెండింతలు అయిందన్నారు. ఇప్పటికే 5 వేల కిలోమీటర్లకు పైగా పూర్తి అయిందని తెలిపారు. తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలతో జాతీయ రహదారుల అనుసంధానం జరుగుతోందన్నారు. Also Read:Illegal Sand Transportation: ఆంధ్రా…
విజయవాడ పర్యటకు వెళ్లిన కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి.. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.. చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ లంచ్ మీటింగ్‌లో పలు అంశాలపై చర్చించారు.. ఆ తర్వాత చంద్రబాబు నివాసం నుంచి విజయవాడ బయల్దేరి వెళ్లారు.. సాయంత్రం 6 గంటలకు విజయవాడ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లి.. అక్కడి నుంచి హైదరాబాద్‌కు వెళ్లనున్నారు కిషన్ రెడ్డి..
హైదరాబాద్ అంబర్‌పేట్ ఫ్లై ఓవర్‌ను సోమవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభిస్తారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. అంబర్‌పేట్ ఫ్లై ఓవర్ పనులను కిషన్‌రెడ్డి పరిశీలించారు.
పీసీసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. “కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ది అమిత్ షాకు చెప్పులు తొడిగిన చరిత్ర.. 11ఏండ్లు తెలంగాణకు ఏమి తెచ్చారో కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు వైట్ పేపర్ రిలీజ్ చేయండి.. చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. మోడీ, అమిత్ షాలు ఆర్డర్ వేస్తేనే కిషన్ రెడ్డి, బండి…
రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. "తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డా లేక నేనా? కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి ఎన్నికల హామీలు ఇచ్చారా? తెలంగాణ క సంబంధించిన అన్ని ప్రాజెక్టుల విషయంలో నేను రాష్ట్ర ముఖ్యమంత్రులతో మాట్లాడుతూ నిధులు తీసుకొస్తున్నా. రేవంత్ రెడ్డి గాలి మాటలను ప్రజలు అర్థం చేసుకున్నారు.
సీఎంలు అనుకూలంగా మాట్లాడే టీచర్లు ఎమ్మెల్సీలు అయ్యారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.. తెలంగాణలో పాత పీఆర్సీ దిక్కులేదని చెప్పారు. ఉద్యోగి రిటైర్మెంట్ అయ్యాక రెండు మూడు ఏళ్లు గడిచిన బెనిఫిట్స్ ఇవ్వడం లేదని.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాలా తీసిందన్నారు. దానికి కేసీఆర్, రేవంత్ రెడ్డి కారణమని స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలు గెలుస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ సవాల్ ను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. "హామీల అమలుకు ప్రణాళిక, కార్యాచరణ ప్రకటిస్తే చర్చకు సిద్ధం. ఏ ఒక్క హామీకి కనీసం కార్యాచరణ కూడా లేదు. చర్చకు రమ్మనడం హాస్యాస్పదం. దేనికి చర్చకు రావాలి సీఎం రేవంత్ స్పష్టం చెయ్యాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలోచించి ఓటేయాలి బీజేపీని ఆదరించాలి.
కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలు మోసమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మెదక్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. "అశోక్ నగర్ లో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. 14 నెలలు అయినా వారి గురించి కానీ జాబ్ క్యాలెండర్ గురించి పట్టించుకోవడం లేదు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది. ఉద్యోగులకు జీతాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, DA లు ఇవ్వలేని పరిస్థితి ఉంది. మిగులు…