దేశ రాజధాని ఢిల్లీలో పురానా ఖిల్లాకు ఓ ప్రత్యేకత ఉంది అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆయన ఇవాళ ( మంగళవారం ) పురాతన ఖిల్లాను సందర్శించారు. గత చరిత్ర ఆధారాలు పురాణ ఖిల్లా వద్ద లభిస్తున్నాయి.. అనేక యుగాల వ్యక్తుల ఆనవాళ్లు పురాణ ఖిల్లా లో లభ్యం అవుతున్నాయి.. పురాణ ఖిల్లాపై పాండవులు కూడా సంచరించారు అని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి తెలిపారు.
Also Read : avitra lokesh: పవిత్రా లోకేష్ మనసులో మరో ఇద్దరు హీరోలు.. నరేష్ ఏమైపోతాడు..
మహాభారతం లోని ఇంద్ర ప్రస్త గ్రామమే నేటి ఢిల్లీ అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న తవ్వకాల్లో 9 లేయర్లు బయట పడ్డాయని ఆయన తెలిపారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న తవ్వకాల్లో పురాణ ఖిల్లా తవ్వకాలు చాలా ముఖ్యమైనవి.. అనేక కాలాల ప్రజలు ఇక్కడ జీవించారు.
ప్రస్తుత త్రవ్వకాలలో దేవతా విగ్రహాలు,130 కాయిన్స్ బయట పడ్డాయి.
Also Read : Heart Attacks: గుండెపోటుపై ఎయిమ్స్ అధ్యయనం.. సీరియస్‌నెస్ గుర్తించని 55 శాతం మంది..
పురానా ఖిల్లాలో తవ్వకాలపై పరిశోధనలు జరుగుతున్నాయి అని కిషన్ రెడ్డి వెల్లడించారు. పురాతన చరిత్రకు ఇక్కడ ఆధారాలు ఉన్నాయి.. మహాభారతం నాటి ఆనవాళ్లు, 2500 ఏళ్ల క్రితం ఆనవాళ్లు లభిస్తున్నాయి అని ఆయన చెప్పారు. అలాగే.. కాంగ్రెస్ ప్రభుత్వంతో విసిగిపోయిన ప్రజలు బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారన్నారని ఆయన అన్నారు. 2014 నుంచి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ సమ్మిళిత అభివృద్ధితో సుస్థిర ప్రభుత్వాన్ని అందించిందని కిషన్ రెడ్డి తెలిపారు.
Also Read : RRR: ఆ రోజుల్లోనే ‘RRR’ కాంబినేషన్.. వీడియో వైరల్
గత తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వివిధ సంక్షేమ చర్యలను ప్రస్తావిస్తూ, కోవిడ్ -19 మహమ్మారి సమయంలో, దేశం మొత్తం ప్రధాని వెనుక ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాని మోడీ స్వదేశీ వ్యాక్సిన్ల ఉత్పత్తికి పిలుపునివ్వడంతో 200 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను ప్రజలకు అందించామనీ, కోవిడ్ -19 మహమ్మారి నుంచి ప్రజలకు రక్షణ కల్పించామని కిషన్ రెడ్డి చెప్పారు.