KTR: ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత ఎక్కడ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాష్ట్ర కేటీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని, ముఖ్యంగా ఆరు గ్యారెంటీలకు ఇప్పటివరకు చట్టబద్ధత కల్పించలేదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని గతంలో గవర్నర్ ప్రసంగంలో చెప్పించినప్పటికీ ఇప్పటికి రెండున్నర సంవత్సరాలు గడిచినా ఎలాంటి చట్టబద్ధత లేదని కేటీఆర్ అన్నారు. ఈ అంశంపై రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీస్తామని అన్నారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రైతు బంధు సమయానికి అందేదని, కానీ ప్రస్తుతం రైతులు పంటలు కోయడానికి వచ్చినా.. రైతు బంధు గురించి ప్రభుత్వం నుంచి స్పష్టత లేదని కేటీఆర్ విమర్శించారు. “రాహుల్ బంధు కాదు.. రైతు బంధు వేయండి అంటూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. బలహీన వర్గాల కోసం ఐదేళ్లలో లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని ప్రభుత్వం చెప్పిందని, కానీ ఇప్పటికే రెండు బడ్జెట్లు పూర్తయ్యినా ఆ దిశగా స్పష్టత కనిపించలేదని ఆయన అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు అంబేద్కర్ అభయహస్తం పథకం కింద 12 లక్షలు ఇస్తామని చెప్పినా ఇప్పటివరకు అమలు కాలేదని ఆరోపించారు.
రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని కేటీఆర్ అన్నారు. అలాగే జాబ్ క్యాలెండర్ ప్రకటించినప్పటికీ కొత్త ఉద్యోగాలు కనిపించడం లేదని విమర్శించారు. మహిళలకు ఇవ్వాల్సిన హామీలు, వృద్ధులకు 4000 రూపాయల పెన్షన్, రైతులకు రైతు భరోసా, రైతు కూలీలకు నెలకు 1000 రూపాయల సహాయం వంటి అంశాలు ఇంకా అమలు కాలేదని.. ఆటో డ్రైవర్లకు ఇవ్వాల్సిన సహాయం కూడా పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు.
Vaibhav Suryavanshi: ఐపీఎల్‌లో ఆ దిగ్గజం రికార్డ్‌ను బద్ధలుకొడుతా.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు సుమారు 10 వేల కోట్ల వరకు ఉన్నాయని కేటీఆర్ అన్నారు. ఈ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మాజీ సీఎం కేసీఆర్ నిర్మించిన బలమైన రాష్ట్రాన్ని ప్రస్తుత ప్రభుత్వం సరిగా నిర్వహించలేకపోతోందని, వ్యవస్థలో అవ్యవస్థలు నెలకొన్నాయని.. తెలంగాణను ఒక ఏటీఎంగా మార్చి ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారని ఆరోపించారు. ఈ అన్ని అంశాలపై రాబోయే సమావేశాల్లో ప్రజల తరపున పోరాడతామని కేటీఆర్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..