Kishan Reddy: మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీకి వెల్లి మహిళా రిజర్వేషన్ బిల్లుపై పోరాడం ఏంటని, మీకు ఏ అధికారం ఉందంటూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం పై మండిపడ్డారు. మీరు మహిళా రిజర్వేషన్ పై ఢిల్లీలో వచ్చి ఆందోళన చేస్తున్న కేసీఆర్ కుటుంబంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు ఏ రకమైన అధికారం ఉందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అధికారంలో వున్న ఐదు సంవత్సరాల పాటు మీ మంత్రి వర్గంలో ఒక్క మహిళా కూడా లేని ప్రభుత్వాన్ని ఎలగబెట్టిన మీరు ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లుపై పోరాడటం ఏంటని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ధర్నా చేయాలంటే.. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కాదు సీఎం కేసీఆర్ కుటుంబం మీద చేయాలని మండిపడ్డారు. ధర్నా చేయాలంటే కేసీఆర్ నివాసం ముందు, సీఎం కార్యాలయం ముందు, తెలంగాణ ప్రభుత్వం ముందు నిరసన దీక్ష చేయాలి కానీ ఢిల్లీలో కాదని సంచలన వ్యాక్యలు చేశారు.
Read also: NTR 30: షిప్ పై భారి యాక్షన్ ఎపిసోడ్ తో షూట్ మొదలు… అరాచకం ఆరంభం
బీజేపీలో అత్యధికంగా మహిళా ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు ఉన్న పార్టీ అని అన్నారు. స్వాతంత్రం వచ్చిన తరువాత మొదటి సారి అత్యధికంగా మంత్రులు ప్రాతి నిత్యం వహిస్తున్నటు వంటి ప్రభుత్వం మాదని కొనియాడారు. మహిళలంటే మాకు గౌరవమని, మీలాగా మహిళా ద్వేషి కలిగినటువంటి పార్టీ కాదని స్పష్టం చేశారు. ఈరోజు సీఎం కుటుంబంపై వచ్చినటు వంటి అనేక రకాల అవినీతి ఆరోపణలపై ప్రజల దృష్టిని మళ్లించడం కోసం నాటకమే తప్పా మరేంకాదని కిషన్ రెడ్డి బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు గుప్పించారు.
Read also: AIADMK Chief: అన్నాడీఎంకే చీఫ్‌గా పళనిస్వామి.. పన్నీర్ సెల్వం సంగతేంటి?
మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం బీఆర్ఎస్ ఉద్యమం ఉధృతం చేసింది. నేడు లోక్ సభ లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ కోరుతూ వాయిదా తీర్మానం ఇచ్చిన బీఆర్ఎస్. అఖిలపక్ష సమావేశం నిర్వహించి మహిళ రిజర్వేషన్ బిల్లుపై చర్చించాలని ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోతు కవిత ఈ తీర్మానం నోటీసులు అందజేశారు. కాగా.. మహిళా రిజర్వేషన్ల కోసం గతంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేయడంతోపాటు దాదాపు 18 పార్టీలతో, ఆయా మహిళా, సంఘాలతో సంఘాలతో భారత్ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన విషయం విధితమే.
Sai Pallavi: ముంబైలో మెరిసిన ఎర్ర గులాబీ…