Kishan Reddy: మహబూబ్ నగర్ లో జరిగే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ ర్యాలీ లో పాల్గొనేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బయలుదేరారు. ర్యాలీ అనంతరం అక్కడ జరిగే సభలో పాల్గొననున్నారు. పేదల కల.. డబుల్ బెడ్రూం ఇండ్లని, పేదలకు అందించే వరకు మా పోరాటం సాగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని చెప్పి పేదలను మోసం చేసిందని తెలిపారు. కేంద్రం ‘పీఎం ఆవాస్ యోజన’ కింద ఇచ్చే నిధులను ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. కట్టిన ఇండ్లు పాడవుతున్నా పేదలకు ఇవ్వకపోవడం కేసీఆర్ అహంకారానికి నిదర్శనమని తెలిపారు. పేదలకు న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుందని అన్నారు.
Read also: Extramarital Affair: ఆటో డ్రైవర్‌తో భార్య ఎఫైర్.. వేట కొడవలితో భర్త దాడి
వరద ముంపు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేంద్రం నిధులు రూ. 900 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయని, వరద బాధితులకు ప్రభుత్వం సాయం చేయడం లేదన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర బీజేపీ నేతలు పర్యటిస్తున్నారని తెలిపారు. వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాలు కూడా వచ్చాయన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం ఒకే ముక్కలని విమర్శించారు. గతంలో మూడు పార్టీలు పొత్తులు పెట్టుకుని కలిసి పనిచేశాయన్నారు. పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాసానికి బీఆర్‌ఎస్ మద్దతు తెలిపిందన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు కుటుంబ, అవినీతి, నియంతృత్వ పార్టీలని విమర్శించారు.
Read also: Kodanda Reddy: రాజకీయాల కోసమే తప్పితే.. ప్రజల సమస్యలు పట్టవు
రాష్ట్రంలో బీజేపీ బలపడుతోందని కిషన్ రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గిరిజిన రిజర్వేషన్లపై బీజేపీ ఎంపీ సోయం బాపురావు వ్యాఖ్యలు వ్యక్తిగతమని కిషన్ రెడ్డి అన్నారు. సోయం బాపురావు వ్యాఖ్యలతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. తన వ్యాఖ్యలపై పార్టీ వివరణ కోరుతుందని చెప్పారు. లంబాడీలకు రిజర్వేషన్లకు బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. లంబాడీలు అధికారంలోకి రాగానే వారికి బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Extramarital Affair: ఆటో డ్రైవర్‌తో భార్య ఎఫైర్.. వేట కొడవలితో భర్త దాడి