ప్రముఖ నృత్యకారిణి, పద్మ విభూషణ్ యామినీ కృష్ణమూర్తి మృతి పట్ల కేంద్ర కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంతపం తెలిపారు. భారతదేశంలో భరతనాట్యానికి కేరాఫ్ అడ్రస్‌గా ప్రఖ్యాతి గడించిన పద్మవిభూషణ్ యామినీ కృష్ణమూర్తి ఇకలేరనే వార్త విచారకరం అన్నారు.
Kishan Reddy: బోనాల ఉత్సవాల సందర్భంగా అంబర్ పేటలోని మహంకాళి అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. బోనాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
కీలకమైన, తక్కువగా లభించే ఖనిజాల వెలికితీతలో అద్భుతమైన ఫలితాలు సాధించేందుకు విస్తృతమైన అవకాశాలున్నాయని.. అందుకే ఈ రంగంలో విడతలవారిగా సంస్కరణలు తీసుకొస్తూ.. దేశ ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తున్నామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. 2015లో కొత్తగా తీసుకొచ్చిన చట్టం ద్వారా.. సానుకూల మార్పులు కనబడుతున్నాయని ఆయన వెల్లడించారు.
BJP Rally: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కేంద్రమంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఇవాళ రాష్ట్రానికి వస్తున్నారు.
Kishan Reddy: సికింద్రాబాద్‌లో కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెంటర్ ను వర్చువల్ గా కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ప్రారంభించారు.
ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ముందుకు కదిలింది. ఇటీవల బడ్జెట్‌లో రూ.900ల కోట్లు కేటాయించిన కేంద్రం వచ్చే విద్యా సంవత్సరం నుంచే క్లాస్‌లు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. యూనివర్సిటీ ఏర్పాటు కోసం గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 337 ఎకరాల భూమిని సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ భూమి చుట్టూ ట్రెంచ్ కొట్టించింది.
వేయి స్తంభాల గుడిలో పునర్నిర్మాణం చేసిన కళ్యాణమండపాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఆలయానికి ఉదయమే చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా వేయి స్తంభాల గుడిలో కిషన్ రెడ్డి పూజలు చేశారు.
Kishan Reddy: బీజేపీ అభ్యర్థుల జాబితా ఎప్పుడైనా రావొచ్చని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో మెజార్టీ సీట్లు సాధించేందుకు విజయ సంకల్ప యాత్రలు చేస్తున్నారని తెలిపారు.
బీజేపీపై తీవ్రంగా మండిపడ్డారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని.. కేంద్ర మంత్రులు ఢిల్లీలో ఉన్నప్పుడు ఒకతీరు.. హైదరాబాద్ వచ్చాకా ఇంకో తీరుగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ మీద ఏదో ఒక నింద వేయాలని కిషన్ రెడ్డి చూస్తున్నారని ఆయన అన్నారు.