AI Deepfake Scam: నిర్మలా సీతారామన్ ‘AI’ వీడియోతో నమ్మించి.. వృద్ధురాలికి రూ. 87 లక్షల కుచ్చుటోపీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AI deepfake scam: సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త స్కామ్స్ తో ప్రజల వద్ద నుండి డబ్బులు లాగేస్తున్నారు. తాజాగా దేశ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫోటోలు, వీడియోలనే వాడుకుంటూ కేటుగాళ్లు రెచ్చిపోయారు. డీప్ ఫేక్ (AI) సాంకేతికతతో సృష్టించిన నకిలీ వీడియోను చూసి నిజమని నమ్మిన ఓ వృద్ధురాలు ఏకంగా రూ. 87.96 లక్షలు పోగొట్టుకున్న ఘటన మల్కాజిగిరిలో వెలుగుచూసింది.
Hyderabad: ఘోరం.. చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై అఘాయిత్యం.. ఆపై హత్య!
Also Read
- 165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
అసలేం జరిగిందన్న విషయానికి వెళితే.. బాధిత వృద్ధురాలు సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తుండగా, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్టాక్ మార్కెట్ పెట్టుబడుల గురించి వివరిస్తున్నట్లు ఉన్న ఒక వీడియో ఆమె కంటపడింది. అది ఏఐతో సృష్టించిన నకిలీ వీడియో అని తెలియని ఆమె, సాక్షాత్తు మంత్రి గారే చెబుతున్నారు కదా అని నమ్మి ఆ వీడియో లింక్‌ను క్లిక్ చేశారు. లింక్ క్లిక్ చేసిన వెంటనే సైబర్ కేటుగాళ్లు రంగంలోకి దిగారు. బాధితురాలికి వాట్సాప్ కాల్స్ చేసి తాము పెద్ద ట్రేడింగ్ సంస్థ ప్రతినిధులమని పరిచయం చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో ‘ట్రేడ్ యాప్’ (TradeApp) అనే ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించారు. ఇందుకోసం ఆమె ఐడీ ప్రూఫ్స్, బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకుని, ఒక యూజర్ ఐడీ, పాస్వర్డ్ క్రియేట్ చేసి ఇచ్చారు. ఇక అంతే వారి అసలైన ప్లాన్ అమలు చేశారు. మొదట నమ్మకం కలిగించడానికి కేవలం రూ. 60 వేలు ఇన్వెస్ట్ చేయించారు. ఆ తర్వాత లాభాలు వస్తున్నట్లు నకిలీ గ్రాఫిక్స్ తో స్క్రీన్ పై చూపించి.. దఫదఫాలుగా మొత్తం రూ. 87.96 లక్షలు డిపాజిట్ చేయించుకున్నారు.
Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?
తన అకౌంట్‌లో భారీగా డబ్బు కనిపిస్తుండటంతో, బాధితురాలు ఆ మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవడానికి ప్రయత్నించారు. అయితే సాంకేతిక కారణాలు చెప్తూ కేటుగాళ్లు ఆమెను అడ్డుకున్నారు. ఎంత ప్రయత్నించినా డబ్బు చేతికి రాకపోవడంతో, తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు వెంటనే మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఇక బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ఆ డబ్బు ఏ అకౌంట్ల లోకి వెళ్లిందో దర్యాప్తు చేస్తున్నారు. మీరు కూడా ఇలాంటి అనుమానాస్పద లింక్స్ లేదా కాల్స్ వస్తే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయండి.
తాజావార్తలు
-
Rohit-Kohli Records: గువాహటిలో రో-కో రికార్డుల జాతర.. దిగ్గజాల ఖాతాలో ఎన్నో ప్రత్యేకతలు!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
Varanasi : రికార్డ్ ధర పలుకుతున్న వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్.. పోటీలో మైత్రి, దిల్ రాజు, నాగవంశీ
-
AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
ట్రెండింగ్
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!