Kishan Reddy: ప్రజాజీవనాన్ని సౌలభ్యంగా మార్చడమే మోదీ సర్కారు లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని 5 రహదారులను (రిచర్డ్‌సన్ రోడ్, ప్రోట్నీ రోడ్, బయామ్ రోడ్, అమ్ముగూడ రోడ్, అల్బయిన్ రోడ్) సామాన్య ప్రజల వినియోగానికి తెరిచేందుకు రక్షణ శాఖ అనుమతించడం పట్ల కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇందుకుగానూ రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ‘సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని రిచర్డ్‌సన్, ప్రోట్నీ, బయామ్, అమ్ముగూడ, అల్బయిన్ రోడ్లను సామాన్య ప్రజల రాకపోకల కోసం అనుమతించాలని నిర్ణయం తీసుకోవడం పట్ల రాజ్ నాథ్ సింగ్ గారికి ధన్యవాదములు తెలియజేస్తున్నాను. పలుమార్లు ఈ అంశంపై వారిని కలిసి సమస్యను విన్నవించాను. రోడ్లను తెరిచేందుకు వారు మనస్ఫూర్తిగా అంగీకరించారు’ అని కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.
Read Also: CPI Narayana: సాంకేతిక అంశంతో రాహుల్ గాంధీని వేధిస్తున్నారు.. ఈ పాపం ఊరికే పోదు
Also Read
- Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- Quantum Valley Twin Towers: అమరావతిలో మరో భారీ ప్రాజెక్ట్.. 25 వేల మందికి ఉద్యోగాలు..!
- AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
‘జాతీయ భద్రత, ప్రజలకు సౌలభ్యం అనే రెండు సున్నితమైన అంశాల విషయంలో అన్ని పక్షాలు కలిసి కూర్చుని చర్చించుకుని పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉంది. రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన సందర్భంలో.. కంటోన్మెంట్ ప్రాంతానికి నీరు, విద్యుత్ సరఫరా నిలిపేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన బెదిరింపులు.. తదితర అంశాలను కూడా తెలియజేశానని కిషన్ రెడ్డి వెల్లడించారు. నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజాజీవనాన్ని సౌలభ్యం చేసేందుకు కృషిచేస్తోందని కేంద్రమంత్రి ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
-
Explainer: మానవాళి కథ ముగియబోతోంది!?
-
Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
-
DSC 2008 : డీఎస్సీ-2008 అభ్యర్థులకు హైకోర్టు షాక్.. మూడు పిటిషన్లు కొట్టివేత
-
Quantum Valley Twin Towers: అమరావతిలో మరో భారీ ప్రాజెక్ట్.. 25 వేల మందికి ఉద్యోగాలు..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!