సీఎం కేసీఆర్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం, వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ, సీపీఎం, సీపీఐ, అన్నాడీఎంకే కూడా జాతీయ పార్టీలే.. దేశంలో పార్టీలు రావడం, పోవడం కొత్త కాదు అన్నారు. ఒక్క సీటు లేని జాతీయ పార్టీలు కూడా ఉన్నాయన్న ఆయన.. ఎవరు ఏందో వచ్చే ఎన్నికల్లో తేలుతుందన్నారు. ఇక, ప్రశాంత్ కిషోర్…
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోకి వచ్చిన ఇంటెలిజెన్స్ పోలీసులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యాలయంలోకి ఎలా వస్తారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఫోన్లు ట్యాప్ చేస్తున్నది సరిపోవడం లేదా? అని తీవ్రంగా మండిపడ్డారు.
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సంవత్సరం పాటు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో గుర్తింపు దక్కని ఉద్యమకారులను కేంద్ర ప్రభుత్వం గుర్తించి వారిని స్మరించుకొనున్నట్లు పేర్కొన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో వందేమాతరం అని నినాదించి జైలుకు వెళ్లిన వందేమాతరం రామచందర్ రావు కుటుంబ సభ్యులను కిషన్ రెడ్డి బేగంబజార్ లో ఆయన కలిశారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య దేశంలో నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమించిన…
Satyavathi Rathod criticized union minister Kishan Reddy: కేంద్రమంత్రి ఒక పార్లమెంట్ కే పరిమితమై పనిచేయడం సిగ్గు చేటని.. నిర్మలా సీతారామన్, కిషన్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మంత్రి సత్యవతి రాథోడ్. బీజేపీకి తెలంగాణలో చోటు లేదని.. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసిన మూడో స్థానమే అని ఆమె అన్నారు. తెలంగాణలో బీహార్ కూలీలు 30 లక్షల మంది ఉన్నారని.. రాష్ట్రంలోని అనేక సంస్థల్లో వారు పనిచేస్తున్నారని ఆమె అన్నారు.
Telangana Vimochana Dinotsavam: తెలంగాణ విమోచన దినోత్సవంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు సమాయత్తం అవుతోంది. సెప్టెంబర్ 17న జరిగే విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలనుకుంటోంది. కేంద్ర సాంస్కృతిక, కేంద్ర హోం శాఖ అధ్వర్యంలో పెరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవాలు జరగనున్నాయి. కేంద్ర హోం శాఖ పరిధిలో సాయుధ దళాలతో పెరేడ్ నిర్వహించనున్నారు.