ఎమ్మెల్సీ కవితకి ఈడీ నోటీస్ ల పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఈడీ నోటీసులు ఇస్తే తప్పేంటి? అంటూ ప్రశ్నించారు. లిక్కర్ వ్యాపారం చేసింది మీరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Union Minister Kishan Reddy: కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత కిషన్ రెడ్డి ఇంట విషాదం నెలకొంది.. కిషన్‌రెడ్డి మేనల్లుడు జీవన్ రెడ్డి మృతిచెందాడు.. ఆయన వయస్సు 50 ఏళ్లు.. జీవన్‌రెడ్డి గుండెపోటుతో కన్నుమూశాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు.. హైదరాబాద్‌లోని సైదాబాద్ వినయ్ నగర్‌లో కిషన్‌రెడ్డి అక్క బావ లక్ష్మీ, నర్సింహారెడ్డి నివాసం ఉంటారు.. వాళ్ల కుమారుడే జీవన్‌రెడ్డి.. గురువారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలి పోయిన జీవన్‌రెడ్డిని.. వెంటనే…
సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. దేశ ఆర్థిక పరిస్థితిపై చర్చకు ఎక్కడికి రమ్మంటే అక్కడు వస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణా బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న అంశాలపై చర్చ జరగలేదని మండిపడ్డారు.
బంగారు తెలంగాణగా మారుస్తానని.. సీఎం కేసీఆర్ వాళ్ళ కుటుంబాన్ని బంగారం చేసుకున్నాడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ వారసిగుడ సభలో ప్రజా గోస - బీజేపీ భరోసా శక్తి కేంద్రాల్లో బీజేపీ నిర్వహించిన సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రవేశ పెట్టారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రప్రభుత్వం సాధించిన విషయాలను బీఆర్ఎస్ చెప్పుకోవాలన్నారు.
హైదారబాద్ లోని తాజ్ కృష్ణ లో G-20 స్టార్టప్-20 సదస్సు ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సదస్సులో 20 దేశాల ప్రతినిధులు 9దేశాల ప్రత్యేక ఆహ్వానితులు వివిధ అంతర్జాతీయ స్టార్టప్ సంస్థలు పాల్గొన్నారు. స్టార్టప్ ల అభివృద్ధి ఎజెండాగా ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలపై ప్రతినిధులు చర్చించనున్నారు.
Union Minister Kishan Reddy criticizes CM KCR and KTR: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. తండ్రిని, కుటుంబాన్ని అడ్డుపెట్టుకుని కేటీఆర్ లా మంత్రి కాలేదని, కష్టపడి పైకొచ్చామని అన్నారు. కేసీఆర్ కన్నా దిగజారి కేటీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. మోదీని విమర్శిస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్లే అని అన్నారు. బీఆర్ఎస్ నేతలు మిడిమిడి జ్ఞానం, తప్పుడు ఆలోచనతో మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఎవరూ బయటకు రాని సమయంలో…
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి బహిరంగసవాల్ విసిరారు తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. నేను చెప్పేది తప్పయితే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా.. మీరు చెప్పేది తప్పైతే కేంద్ర మంత్రి పదవి వదిలి పెట్టకపోయినా.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.