ఐపీఎల్: నేడు రెండు మ్యాచ్‌లు. అహ్మదాబాద్ వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలు గుజరాత్ vs చెన్నై మ్యాచ్. ఢిల్లీ వేదికగా రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్ vs కోల్‌కతా మ్యాచ్.
నేడు తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల. OUలో మధ్యాహ్నం 12.30 గంటలకు ఫలితాలు విడదల చేయనున్న ఉన్నత విద్యామండలి. ఈనెల 12న జరిగిన తెలంగాణ ఈసెట్ పరీక్ష.
ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. నిన్న నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన రేవంత్ రెడ్డి. ఇవాళ కాంగ్రెస్ పెద్దలతో పాటూ కేంద్రమంత్రులను కలవనున్న సీఎం రేవంత్.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. కంపార్ట్‌మెంట్లన్నీ నిండి బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 90,211 మంది భక్తులు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.11 కోట్లు.
తమిళనాడుకు భారీ వర్ష సూచన. తమిళనాడు వ్యాప్తంగా 13 జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం. ఊటీకీ 2 రోజుల పాటు రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ. నేడు, రేపు ఊటీలో పలు పర్యాటక ప్రాంతాలు మూసివేసిన అధికారులు. అవసరమైతే తప్ప బయటకు రావొదదని IMD హెచ్చరికలు. .
నేడు ఢిల్లీలో NDA పాలిత రాష్ట్రాల సీఎం, డిప్యూటీ సీఎంల సమావేశం. సుపరిపాలన, అనుసరించాల్సిన అత్యుత్తమ పద్ధతులపై సమాలోచనలు. సమావేశాన్ని సమన్వయం చేస్తూ బీజేపీ సుపరిపాలన విభాగం. ఆపరేషన్ సిందూర్ విజయవంతంపై మోడీ, రక్షణ బలగాలను అభినందిస్తూ తీర్మానం. భేటీలో పాల్గొననున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,300 లుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,900 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.1,00,000 లుగా ఉంది.
కరీంనగర్: నేడు కాళేశ్వరానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. సరస్వతి నది పుష్కరాల లో పాల్గొననున్న గవర్నర్. ఉదయం 10 గంలకు బేగంపేట నుంచి బయలుదేరనున్న గవర్నర్ దంపతులు. త్రివేణి సంగమంలో సతీసమేతంగా పుష్కర స్నానం చేసి కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకోనున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.
నేడు డీఈఈసెట్ పరీక్ష. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష.