ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు. నేడు ఏడుగురు కేంద్రమంత్రులతో భేటీ కానున్న సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, పథకాలపై చర్చించుకున్న చంద్రబాబు. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో ఏపీకి సహకారం అందించాలని చంద్రబాబు కోరే అవకాశం.
నేడు సంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. రూ.494.67 కోట్లతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్న సీఎం రేవంత్. జహీరాబాద్ నియోజకవర్గంలో బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరణతో పాటు కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. పస్తాపూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనున్న సీఎం రేవంత్.
తిరుమల: నేడు ఆన్ లైన్ లో ఆగష్టు నెలకు సంబంధించిన దర్శన టిక్కెట్లు విడుదల చేయనున్న టీటీడీ. ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకెన్లు విడుదల. ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్ల విడుదల. మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధుల, వికలాంగుల దర్శన టిక్కెట్లు విడుదల. రేపు ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల.
తెలుగు రాష్ట్రాల్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.97,920 లుగా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,760 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.1,12,100 లుగా ఉంది.
రెండు, మూడు రోజుల్లో కేరళను తాకనున్న రుతుపవనాలు. అరేబియా సముద్రంలో అల్పపీడనం. వాయుగుండంగా మారే అవకాశం. ఈ నెల 27న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. ఏపీకి మరో రెండు రోజులపాటు వర్షసూచన. తెలంగాణకు మరో నాలుగు వర్షాలు కురిసే అవకాశం. తెలంగాణలోని ఆరు జిల్లాలకు ఎల్లో అలర్ట్. కోస్తాంధ్రలో అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం. ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, కృష్ణాజిల్లాల్లో భారీ వర్షాలు. పలుచోట్ల పిడుతులతో కూడిన వర్షాలు పడే అవకాశం.
ఐపీఎల్‌లో నేడు బెంగళూరు వర్సెస్ హైదరాబాద్. లక్నో వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్.
సాయంత్రం ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రేపు నీతిఆయోగ్ సమావేశానికి హాజరుకానున్న రేవంత్.
నేటి నుంచి సిరాజ్, సమీర్‌ను విచారించనున్న పోలీసులు. నేడు విశాఖ సెంట్రల్ జైలు నుంచి విజయనగరం తరలింపు. పేలుళ్ల కుట్రకేసులో కీలకంగా మారనున్న కస్టడీ విచారణ. మ
తూర్పుగోదావరి జిల్లా : నేడు రాజమండ్రిలో జిల్లా టీడీపీ మహానాడు. జిల్లా ఇన్చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు అధ్యక్షతన జరగనున్న మహానాడు. రాజమండ్రి జెఎన్. రోడ్ లోని. చెరుకూరి గార్డెన్స్ లో జరగనున్న జిల్లా మహానాడు. మహానాడుకు హాజరుకానున్న జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు, పార్టీ శ్రేణులు.
కాకినాడ: కాకినాడ జిజిహెచ్ లో కోవిడ్ అప్రమత్తత. విశాఖలో కోవిడ్ కేసు నమోదు కావడంతో 24 బెడ్ లతో జిజిహెచ్ లో కరోనా వార్డు. అందుబాటులో 1100 కోవిడ్ కిట్లు, ఒక ఐసోలేటెడ్ వార్డ్. 110 ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు, 48 సిలిండర్లు,50 కేఎల్ కెపాసిటీ గల మూడు ఆక్సిజన్ ట్యాంకులు. కేసులు నమోదు అయితే చికిత్స అందించడానికి ట్రీట్మెంట్ అందించడానికి సిద్ధంగా వైద్యులు.