TTD: తిరుమల మెట్ల మార్గంలో మరోసారి చిరుతలు అలజడి సృష్టిస్తున్నాయి.. గతంలో భక్తులపై దాడి, ప్రాణాలు పోయిన ఘటనలు కూడా ఉండడంతో టీటీడీ అప్రమత్తమైంది.. నిపుణులతో సమావేశం నిర్వహించారు టీటీడీ ఈవో శ్యామలరావు… అలిపిరి మెట్ల మార్గంలో భక్తుల భద్రతకు అదనపు సిబ్బంది కేటాయించాలని నిర్ణయించారు. ఎప్పటికప్పుడు ఆరోగ్యశాఖ ద్వారా చెత్తను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని.. టీటీడీ అటవీ, రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఆరోగ్య, విజిలెన్స్ శాఖలతో కలిసి అటవీ శాఖ సమన్వయంతో నడకమార్గంపై నిరంతర జాయింట్ డ్రైవ్ నిర్వహించాలని.. మానవ-వన్యప్రాణి ఘర్షణ నివారణకు తక్షణ, దీర్ఘకాలిక చర్యల రూపకల్పనలో Wild Life Institute, అటవీ శాఖల సహకారం తీసుకోవాలని సూచించారు.
Read Also: Rain In Hyderabad: హైదరాబాద్లో భారీ వర్షం.. ఈ రూట్లలో వెళ్లారో అంతే సంగతి
అలిపిరి మార్గాన్ని “చిరుత రహిత ప్రాంతంగా” మార్చేందుకు కెమెరా ట్రాప్‌లు, స్మార్ట్ స్టిక్స్, బయో ఫెన్సింగ్‌లు, నెట్ గన్స్, హై ఫ్లాష్ టార్చ్‌లు, పెప్పర్ స్ప్రేలు తదితర రక్షణ పరికరాల వినియోగించేలా టీటీడీ చర్యలకు దిగనుంది.. నిషేధిత ఆహార పదార్థాల అమ్మకంపై దుకాణదారులకు ఆంక్షలు, అవగాహన కల్పించనున్నారు.. అలిపిరి మెట్ల మార్గంలో 2.5 కిలోమీటర్ల పొడవు ఉన్న ఏడవ మైలు నుండి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వరకు పటిష్ట భద్రత కల్పన, నిఘాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు ఈవో శ్యామలరావు.. ప్రతి నెల మానవ – వన్యప్రాణి ఘర్షణలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రణాళికల పురోగతిని సమీక్షించాలని పేర్కొన్నారు టీటీడీ ఈవో శ్యామలరావు.