ఐపీఎల్‌లో నేడు రెండు మ్యాచ్‌లు. జైపూర్ వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు రాజస్థాన్-పంజాబ్ మ్యాచ్. ఢిల్లీ వేదికగా రాత్రి 7.30 గంటలకు ఢిల్లీ-గుజరాత్ మ్యాచ్.
శ్రీహరికోట: PSLV-C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య. మూడో దశ తర్వాత సాంకేతిక సమస్య తెలెత్తింది. మిషన్ అసంపూర్తిగా ముగిసింది. సమస్యపై విశ్లేషించి పూర్తి వివరాలు ప్రకటిస్తాం. -ఇస్రో చైర్మన్
తిరుమల: కోనసాగుతున్న భక్తుల రద్దీ. నిండిపోయిన సర్వదర్శనం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లు. వెలుపల క్యూ లైనులో వేచివున్న భక్తులు. సర్వదర్శనానికి 24 గంటల సమయం. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 87,347 మంది భక్తులు. తలనీలాలు సమర్పించిన 39490 మంది భక్తులు. హుండీ కానుకలు 3.13 కోట్లు.
గుంటూరు జిల్లా: నేడు మంగళగిరి మార్కెట్ యార్డులో టీడీపీ మినీ మహానాడు, పాల్గొననున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు.
విశాఖఫ ఆపరేషన్ సిందూర్ లో పాల్గొన్న త్రివిధ దళలా సైనికులకు సంఘీభావంగా బీచ్ రోడ్డులో తిరంగా ర్యాలీ. పార్క్ హోటల్ నుంచి కాళీ మాత ఆలయం వరకు కొనసానున్న యాత్ర. ముఖ్య అతిథిగా కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ.
నేడు కడప జిల్లాకు పలువురు మంత్రులు రాక. రాష్ట్ర హోం మంత్రి అనిత, జిల్లా ఇన్చార్జ్ మంత్రి సవిత, రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోగ్రామ్ కన్వీనర్ పెందుర్తి వెంకటేష్ లు కడపకు రాక. మహానాడు ఏర్పాట్లను పరిశీలించనున్న మంత్రుల బృందం.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: కాళేశ్వరం సరస్వతీ పుష్కరాల నాల్గవ రోజు పోటెత్తిన భక్తులు.. ఆదివారం కావడంతో వేకువజామున నుండే తెలుగు రాష్ట్రాలతోపాటు మహరాష్ట్ర,చత్తీస్‌గఢ్ రాష్ట్రాలనుండి తరలివస్తున్న భక్తులు. త్రివేణి సంగమంలో భక్తుల పుణ్యస్నానాలు, గోదావరి మాతకు ప్రత్యేక పూజలు.సైకత లింగాలను ఏర్పాటు చేసి పూజిస్తున్న భక్తులు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామి వారి దర్శనానికి క్యూలైన్లో బారులు తీరిన భక్తులు.. స్వామివారిని దర్శించుకుంటున్న వేలాది మంది భక్తులు.