వైఎస్ జగన్మోహన్రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి పై కేసు నమోదు అయ్యింది.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. ఆ తర్వాత శ్రీవారి ఆలయం ముందు రాజకీయ వాఖ్యలు చేశారని రవీంద్రనాథ్ రెడ్డి పై పోలీసులకు ఫిర్యాదు చేశారు టీటీటీ విజిలెన్స్ అధికారులు. ఇక, విజిలెన్స్ ఫర్యాదుతో రవీంద్రనాథ్ రెడ్డిపై కేసు నమోదు చేశారు తిరుమల పోలీసులు.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి టికెట్ తీసుకున్న రోజే దర్శనం కల్పిస్తోంది టీటీడీ.. ఈ ప్రయోగం ఇవాళ్టి నుంచి అమలుకానుంది. శ్రీవాణి టికెట్లు కొనుగోలు చేసిన భక్తులను సాయంత్రం నాలుగున్నర గంటలకు దర్శనానికి అనుమతించనుంది.
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తలకు అలర్ట్.. శ్రీవాణి దర్శన సమయాల్లో మార్పులు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). టికెట్ తీసుకున్న రోజే దర్శనం కల్పిస్తోంది. ఈ ప్రయోగం రేపటి నుంచి అమలుకానుంది. శ్రీవాణి టికెట్లు కొనుగోలు చేసిన భక్తులను సాయంత్రం నాలుగున్నర గంటలకు దర్శనానికి అనుమతించనుంది.
తిరుమలలో వీఐపీల దర్శనంపై కీలక వ్యాఖ్యలు చేశారు భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు.. వీఐపీలు ఏడాదికి ఒక్కసారి మాత్రమే శ్రీవారి దర్శనానికి రావాలంటూ సూచించారు.. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి నిన్న తిరుమల చేరుకున్న వెంకయ్య నాయుడు.
Bible distribution in TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో మరో ఇద్దరు అన్యమత ఉద్యోగుల వ్యవహరంపై పిర్యాదు అందింది. టీటీడీ ఉద్యోగి శేఖర్ ఏకంగా మత ప్రభోదకుడిగా మారారు. మరో ఉద్యోగి కన్నిగ ప్రార్థనా మందిరంలో బైబిల్స్ పంపిణీ చేశారు. ఈ ఇద్దరిపై టీటీడీకి పిర్యాదు అందగా.. అధికారులు చర్యలకు సిద్దమయ్యారు. ఇప్పటికే 5 మంది అన్యమత ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడినా.. అన్యమత ఉద్యోగుల తీరు మారడం లేదు. Also Read: Prithvi Shaw:…
Tirumala Rush: తిరుమలలోని శ్రీనివాసుడి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల శ్రీవారి సన్నిధికి వేలాది సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో అన్యమతస్థ ఉద్యోగుల అంశం చిచ్చు కొనసాగుతూనే ఉంది.. నిన్నటి రోజున శ్రీవారిని దర్శించుకున్న అనంతరం.. టీటీడీలో వున్న వెయ్యి మందికి పైగా అన్యమతస్థులను సాగనంపాలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వాఖ్యలు దుమారం రేపగా.. దీనిపై కౌంటర్ ఇచ్చారు టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. అసలు, టీటీడీలో వెయ్యి మంది అన్యమతస్థ ఉద్యోగులు వున్నారని ఏ ప్రాతిపదికన.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి…
TTD AEO Suspended: తిరుమల తిరుపతి దేవస్థానం ఏఈవో రాజశేఖర్ బాబుపై సస్పెన్షన్ వేటు పడింది. టీటీడీ నిబంధనలకు వ్యతిరేకంగా రాజశేఖర్ బాబు వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు.
తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు కొట్టింది. ఆగమశాస్ర్త నిబంధనలకు విరుద్దంగా ఆలయంపై విమానాలు వెళ్లడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయాన్ని నో ఫ్లైయింగ్ జోన్ ప్రకటించాలని అనేక మార్లు కేంద్రాన్ని కోరారు. కానీ కార్యరూపం దాల్చలేదు.
Tirumala: తిరుమలలోని జీఎన్సీ టోల్ గెట్ వద్ద కారులో మంటలు చెలరేగాయి. ఘట్ రోడ్డులో ప్రయాణం అనంతరం తిరుమలకు చేరుకోగానే దట్టమైన పొగతో మంటలు వ్యాపించాయి. క్షణాల వ్యవధిలో కారు మొత్తం మంటలు వ్యాపించాయి. భక్తులు కారు ఆపి భయటకు పరుగులు పెట్టారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు.