తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది.. 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.. 23వ తేదీన బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుండగా.. ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని.. 24న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ర్ట ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు..
నేడు ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం. ఉదయం 10 గంటలకు ప్రమాణస్వీకారం కార్యక్రమం. కార్యక్రమానికి హాజరుకానున్న ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్, ఎన్డీఏ భాగస్వామ్యపక్ష నేతలు. విశాఖ: ఏపీ లిక్కర్ కేసులో సుదీర్ఘంగా కొనసాగిన సిట్ తనిఖీలు.. నరెడ్డి సునీల్ రెడ్డికి చెందిన కంపెనీల్లో ముగిసిన సోదాలు. నిన్న ఉదయం 11 గంటల నుంచి ఇవాళ తెల్లవారుజాము వరకు కొనసాగిన సిట్ విచారణ.. హార్బర్ పార్క్ ఏరియాలోని వెర్టిలైన్, గ్రీన్ ఫ్యూయల్ సంస్థల కార్యాలయాల నుంచి హార్డ్…
టీటీడీ ఛైర్మన్ బీఆర్.నాయుడిపై మాజీ టీటీడీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. వేదపారాయణదారుల సంఖ్య రోజురోజుకి తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చరిత్రలో కొత్త రికార్డు సృష్టించారు మరోసారి టీటీడీ ఈవోగా నియమితులైన అనిల్ కుమార్ సింఘాల్.. టీటీడీ ఈవోగా రోండోవసారి నియమితులైన మొదటి అధికారిగా అనిల్ కుమార్ సింఘాల్ రికార్డుకెక్కారు..
Tirumala Temple Closed for 12 Hours Today: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. చంద్రగ్రహణం కారణంగా ఇవాళ 12 గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. 16 గంటల పాటు దర్శనాలు నిలిపివేయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి రేపు ఉదయం 3 గంటల వరకు శ్రీవారి ఆలయంను మూసేస్తారు. ఇవాళ మధ్యహ్నం 2 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు దర్శనాలు…
శేషాచలం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఎర్రచందనం. అయితే, అంతేస్థాయిలో అక్కడ వన్య ప్రాణులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చిరుతపులుల సంచారం ఎక్కువైంది. ఏనుగులు, ఇతర వైల్డ్ లైఫ్ కూడా చాలానే ఉంది. వాటిబారి నుంచి మనుషులను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో.. వేటగాళ్ల నుంచి వన్యప్రాణులను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. అందుకే అటవీశాఖ టెక్నాలజీ పరంగా కొన్ని విప్లవాత్మక అడుగులు వేస్తోంది.
భక్తుల రద్దీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొండపై టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు క్యూ లైన్ విధానంలో, వసతుల కల్పనలో మార్పులు చేస్తూ వచ్చింది. 1985లో మొదటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. 2001లో రెండో క్యూ కాంప్లెక్స్‌ను ప్రారంభించింది. ఈ రెండు కాంప్లెక్స్‌లు చాలకపోవడంతో నారాయణగిరి ఉద్యానవనంలో 2014లో తాత్కాలిక క్యూలైన్లను ఏర్పాటు చేసింది. 2019లో నారాయణగిరి ఉద్యానవనంలో కంపార్ట్మెంట్లను అందుబాటులోకి తెచ్చింది.
ఐఏఎస్ అధికారి లక్ష్మీపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.. టీడీఆర్ బాండ్లు విషయంలో ఏ విచారణకైనా నేను సిద్ధం అంటూ సవాల్ విసిరారు.. నాపై వచ్చే విమర్శలకు నేను ఎప్పుడూ స్పందించను.. కానీ, రెండు సంవత్సరాలు నా మనసులో ఉన్న అభిప్రాయం ఇది అన్నారు.