Tirumala: వరుస సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులతో కలియుగ వైకుంఠం కిక్కిరిసిపోయింది. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయి వెలుపల క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు.
ఒక్క కేసు కాదు.. ఇలాంటివి మరో 100 కేసులు పెట్టిన నేను భయపడే వ్యక్తిని కాను అని స్పష్టం చేశారు టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్రెడ్డి.. తనపై కేసులు పెట్టడంపై స్పందించిన ఆయన.. నాపై వ్యక్తిగత దాడులు, వ్యక్తిత్వ హననం చేస్తే భయపడతాం అనుకుంటే మీ భ్రమ.. మీ తప్పుల్ని ఎత్తి
తిరుపతిలోని టీటీడీ ఈవో శ్యామలరావు బంగ్లాలో గురువారం రాత్రి ఓ భారీ నాగుపాము దూరింది. పామును పట్టుకునేందుకు రిటైర్డ్ టీటీడీ ఉద్యోగి రవీందర్ నాయుడు బంగ్లాకు వచ్చారు. చాకచక్యంగా పామును పట్టుకుని గొనె సంచెలో వేస్తుండగా.. రవీందర్ నాయుడు చేతిపై కాటు వేసింది. సిబ్బంది అతడిని హుటాహుటిన స్విమ్స్ హాస్పి�
Shabbir Ali : వక్ఫ్ బోర్డు, మతపరమైన సంస్థల నిర్వహణ, సామాజిక న్యాయంతో సంబంధం ఉన్న అంశాలపై తెలంగాణ ప్రభుత్వ సలహాదారు , సీనియర్ కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు నుంచి తమ పిటిషన్లపై లభించిన సానుకూల తీర్పును స్వాగతించారు. ఈ తీర్పు తమకు ఆనందాన్ని కలిగించడమే కాకుండా, ప్రజల్లో న్యాయం పట్ల
తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేసి.. బెజవాడ కనకదుర్గమ్మ గుడి మెట్లను కడిగిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు తిరుమలలో జరుగుతోన్న అపచారాలు, ఘోరాలకు ప్రాయశ్చిత్తంగా.. తిరుమల మెట్లను కూడా కడగాలని సూచించారు మాజీ మంత్రి ఆర్కే రోజా..
ఎస్వీ గోశాల వివాదం టెంపుల్ సిటీలో పొలిటికల్ హీట్ పెంచింది... అసత్య ప్రచారం చేసిన వైఎస్ జగన్ రేపు ఉదయం ఎస్వీ గోశాలకు రావాలి.. వచ్చి అక్కడి పరిస్థితి నేరుగా చూడవచ్చు అంటూ తెలుగుదేశం పార్టీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సవాల్ విసిరింది... అయితే టీడీపీ సవాల్ కు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు..
క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. తిరుపతిలోని టీటీడీ ఎస్వీ గోశాలను పరిశీలించిన ఆయన.. గోవుల ఆరోగ్య పరిస్థితులు, గోవులకు అందుతున్న దాణాపై ఆరా తీశారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.. టిటిడి గోశాలలో సిబ్బంది నిర్లక్ష్యం ఎక్కడా లేదు, గోవులకు కావాల్సినం
తిరుమలలో మరోసారి భధ్రతా వైఫల్యం భయటపడింది. రాజస్థాన్ కి చెందిన యూట్యూబర్ ఏకంగా శ్రీవారి ఆలయం పై డ్రోన్ కెమెరా ఎగురవేయడం కలకలం సృష్టించింది.. సాయంత్రం 6 గంటల సమయంలో శ్రీవారి ఆలయం ఎదురుగా వున్న హరినామ సంకీర్తన కేంద్రం ముందు నుంచి డ్రోన్ కెమెరా ఎగురవేశాడు యూట్యూర్..
TTD: వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఎస్వీ గోశాలలో గోవులు మృతి చెందాయని అసత్య ప్రచారాలపై భూమనపై ధర్మకర్తల మండలి ఫిర్యాదు చేసింది.
Anna Lezhneva: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నెవా తిరుపతిలోని టీటీడీ అన్నదానం ట్రస్ట్కు భారీ విరాళం ప్రకటించింది. ఆమె కుమారుడు కొణిదెల మార్క్ శంకర్ పేరుతో సుమారు 17 లక్షల రూపాయలను ఉదారంగా విరాళం అందించారు.