కలియుగ దైవం తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది వస్తుంటారు. తమ కష్టాలను కడతేర్చమని, ఐష్టైశ్వర్యాలు ప్రసాదించమని కోరుకుంటూ శ్రీవారికి కానుకలు సమర్పించుకుంటారు. వచ్చే ఏడాది తిరుమలకు వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్తను అందించింది. ఎల్లుండి నుంచి ఆన్ లైన్ లో 2026 పిభ్రవరి నెలకు సంబంధించిన దర్శన టిక్కెట్లు విడుదల చేయ్యనున్నట్లు టిటిడి ప్రకటించింది. ఎల్లుండి ఉదయం లక్కిడిఫ్ లో కేటాయించే ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల చెయ్యనున్నది.
Also Read:Andhra Pradesh:విశాఖలో మేనేజ్ మెంట్ ఇన్ స్టిట్యూట్ హోటల్ ప్రాజెక్ట్.. 2000 మందికి ఉపాధి
21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు విడుదల కానున్నాయి. 24వ తేది ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకెన్లు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టిక్కెట్లు విడుదల అవుతాయి. మద్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధుల, దివ్యాంగుల దర్శన టిక్కెట్లు విడుదల కానున్నాయి. 25వ తేది ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు విడుదల చేయనున్నది టీటీడీ. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో వసతి గదుల కోటా విడుదల కానున్నాయి.