Fake TTD Letters: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేరుతో నకిలీ టీటీడీ లెటర్ల జారీపై విజయవాడ నగర కమీషనర్‌కు ఫిర్యాదు చేశారు. గత కొద్ది రోజులుగా మంత్రి పేరుతో నకిలీ టీటీడీ లెటర్లు జారీ చేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు కమీషనర్ కు సోమవారం నాడు మంత్రి సత్యకుమార్ పీఏ ఫిర్యాదు చేశారు. అయితే, టీటీడీ ఫేక్ లెటర్ల విషయాన్ని మంత్రి కార్యాలయం దృష్టికి బాధితులు తీసుకొచ్చారు.
Read Also: Enumamula Market: బోసిపోయిన ఎనుమాముల వ్యవసాయ మార్కెట్.. అష్టకష్టాలు పడుతున్న అన్నదాతలు!
అయితే, మంత్రి సత్యకుమార్ యాదవ్ పేరుతో ఉన్న నకిలీ టీటీడీ ఫేక్ లెటర్ల జారీపై దర్యాప్తు చేయాలని పోలీస్ కమీషనర్ కు ఫిర్యాదు లెటర్ ను మంత్రి పీఏ అందజేశారు. ఇక, కేసును రిజిస్ట్రర్ చేసి దర్యాప్తు చేపడతామని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు చెప్పారు. టీటీడీ ఫేక్ లెటర్లు ఇచ్చే వారి విషయంలో ప్రజలు జాగ్రత్త వహించాలని కోరారు. బాధితులు మోసపోవద్దని కమిషనర్ రాజశేఖర్ బాబు కోరారు.