TTD Laddu : తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కేసు దర్యాప్తు కీలక దశకు చేరింది. ఈ కేసు వెనుక భారీ కుట్ర ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఇటీవల వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్నఅప్పన్న అరెస్టు కావడంతో పలు ముఖ్యమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సిట్ రిమాండ్ రిపోర్ట్ ప్రకారం.. 2022లో టీటీడీ కొనుగోలు విభాగం జీఎంను చిన్నఅప్పన్న సంప్రదించి, నెయ్యి సరఫరా చేసే భోలేబాబా డెయిరీ యాజమాన్యానికి ఫోన్ చేశారు.
ప్రతి కిలో నెయ్యిపై రూ.25 కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. అయితే, భోలేబాబా డెయిరీ యాజమాన్యం ఈ డిమాండ్‌ను స్పష్టంగా తిరస్కరించడంతో, చిన్నఅప్పన్న కుట్ర పన్నినట్లు సిట్ గుర్తించింది. ఆ డెయిరీపై అనర్హత వేటు వేయించేందుకు టీటీడీ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు విచారణలో బయటపడింది. అదే కాకుండా, అజ్ఞాత వ్యక్తుల ద్వారా పిటిషన్లు వేయించుకుని డెయిరీపై అనర్హత వేటు వేయించేలా చర్యలు తీసుకున్నట్లు సిట్ రిపోర్ట్ వెల్లడించింది. ఈ కుట్ర ఫలితంగా భోలేబాబా డెయిరీ నుంచి నెయ్యి సేకరణను టీటీడీ నిలిపివేసింది.
తదుపరి, ప్రీమియర్ అగ్రిఫుడ్స్ సంస్థ ఆ స్థానంలోకి వచ్చి, రూ.138 ఎక్కువ కోట్ ఇచ్చినా పోటీ లేకపోవడంతో కాంట్రాక్ట్ దక్కించుకుంది. దీంతో, తితిదే లడ్డూల్లో ఉపయోగించిన నెయ్యి నాణ్యతపై పెద్ద అనుమానాలు తలెత్తాయి. సిట్ అధికారులు చిన్నఅప్పన్నను 24వ నిందితుడిగా చేర్చారు. ఆయన పాత్రపై మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని విచారణ అధికారులు తెలిపారు.
IND vs AUS: భారత బౌలర్లపై విరుచుకుపడ్డ ఆసీస్ బ్యాటర్లు.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?